ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాలో వరదలు సంభవించాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో తీవ్ర పంట, ఆస్తి నష్టం చోటు చేసుకుంది. వర్షాలతో అన్నమయ్య ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు చేరడంతో అన్నమయ్య జలాశయం కొట్టుకుపోయింది. దీంతో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోవడం మానవ తప్పిదం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు చేశారు. చంద్రబాబు మాటలకు కౌంటర్‌గా మంత్రి అనిల్ మాట్లాడుతూ.. అన్నమయ్య ప్రాజెక్ట్ కెపాసిటీ 2లక్షల 17…
హాలీవుడ్ సినిమాల బడ్జెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకే ఆ సినిమాల్లో వాడే గ్రాఫిక్స్ అంతా న్యాచురల్‌గా కనిపిస్తుంటాయి కూడా. అయితే తాజాగా హెచ్‌బీవో ఒరిజినల్స్ కోసం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్- స్పిన్‌ఆఫ్’ పైలట్ ఎపిసోడ్‌ను రద్దు చేసింది. టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ బాహుబలి ది బిగినింగ్ సినిమా కంటే ఈ ఎపిసోడ్ చిత్రీకరణకు హెచ్‌బీవో ఎక్కువ ఖర్చుచేసింది. బాహుబలి మొదటి పార్ట్‌కు 28 మిలియన్ల డాలర్లు ఖర్చు కాగా, ‘గేమ్ ఆఫ్…
అండమాన్ లో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త వాయుగుండంగా బలపడి తుఫాన్‌గా మారింది. అయితే ఈ తుఫాన్ పేరు జవాద్ తుఫాన్‌గా నామకరణం చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర, ఒడిశాలపై ఈ జవాద్ తుఫాన్ ప్రభావం పడుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా సముద్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు…
వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుమార్తె కులాంతర వివాహం చేసుకుంటే తమ పరువు పోతుందని భావించిన తల్లి ఏకంగా తన కుమార్తెను కడతేర్చింది. వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మీ తెలిపిన వివరాల మేరకు… పర్వతగిరికి చెందిన ఉబ్బని సమ్మక్కకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తెకు వివాహం జరిపించిన అనంతరం ఆమె భర్త చనిపోయాడు. దీంతో సమ్మక్క కూరగాయలు విక్రయిస్తూ బతుకుబండి నెట్టుకువస్తోంది. Read Also: తూ.గో. జిల్లాలో యువకుడి దారుణహత్య… శవాన్ని ముక్కలు చేసి… ఈ నేపథ్యంలో…
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం కూడా లోక్‌సభ, రాజ్యసభల్లో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ప్రకటన చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. లోక్‌సభలో ప్లకార్డులను ముక్కలు ముక్కలుగా చింపి విసిరేసి నిరసన తెలియజేశారు. వరి కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కేంద్రాన్ని నిలదీశారు. ఐదు రోజులుగా తెలంగాణ రైతుల గురించి తాము ఆందోళన చేస్తున్నామని, తెలంగాణలో వరి ధాన్యం కొంటారా? కొనరా? అనే విషయంపై కేంద్ర…
కరోనా డెల్టా వేరియంట్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోన్న తరుణంలో దక్షిణాఫ్రికాలో మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చి మరోసారి అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది. ఈ కొత్త వేరియంట్ తాజాగా భారత్‌లోకి కూడా ప్రవేశించింది. అయితే నవంబర్ 11న ఓ 66ఏళ్ల వ్యక్తి బెంగుళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చాడు, నవంబర్ 20న 46 ఏళ్ల మరో వ్యక్తి కూడా బెంగుళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అయితే అందరికీ చేసినట్లుగానే వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిద్దరికీ ఒమిక్రాన్ వేరియంట్…
ఉప్పల్ భగాయత్ మూడో దశ వేలంలోనూ హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు ఊహించని రీతిలో కాసుల వర్షం కురిపిస్తోంది. తొలిరోజు వేలంలో అధికారుల అంచనాలు దాటేస్తూ మూసీ తీరాన ప్లాట్లు గతంలో కంటే భారీ స్థాయిలో ధరలు పలికాయి. జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలతో పోటీ పడుతూ ఉప్పల్‌లోనూ రెండు ప్లాట్లు చదరపు గజానికి రూ.1.01లక్షల చొప్పున ధర పలకడం గమనార్హం. మూడో దశలో మొత్తం 44 ప్లాట్లలో తొలిరోజు 23 ప్లాట్లకు వేలం జరిగింది. కేంద్ర ప్రభుత్వ…
రోజూ నాలుగు షోలకు మించకూడదు, బెని ఫిట్ షోస్ అసలు వేయకూడదని ఏపీ సర్కార్ చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు విడుదలైన బాలకృష్ణ ‘అఖండ’ సినిమాను రెండు సినిమా థియేటర్లలో బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. దీంతో అధికారులు ఆ థియేటర్లను సీజ్ చేశారు. చట్ట సవరణ తర్వాత నిబంధనలు ఉల్లంఘించి థియేటర్స్ పై మొదటిసారి సర్కార్ యాక్షన్ తీసుకుంది. కృష్ణా జిల్లా మైలవరంలోని సంఘమిత్ర మిని ధియేటర్ అఖండ సినిమా ఉదయం…
సూర్యాపేట డీఎంహెచ్‌వో కుటుంబంలో 6గురికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. సూర్యాపేటలో డీఎంహెచ్‌వో విధులు నిర్వహిస్తున్న కోటాచలం కుమారుడు గత 5 రోజుల క్రితమే జర్మనీ నుంచి వచ్చాడు. అయితే ఇటీవలే కోటాచలం కుటుంబ సభ్యులతో సహా తిరుపతికి వెళ్లివచ్చారు. అయితే తిరుపతి నుంచి వచ్చిన తరువాత కోవిడ్ లక్షణాలు కనిపించడంతో కోటాచలం కుటుంబ సభ్యులు కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకున్నారు. కరోనా పరీక్షల్లో కోటాచం భార్య, కుమారు, కోడలుకు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ నేపథ్యంలో…
యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టతనివ్వకపోవడంతో రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంభించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ రోజు సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో వివిధ రకాల పంటలను పరిశీలించారు. అంతేకాకుండా అక్కడి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ.. వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు సాగు చేయాలన్నారు. వరిలాంటి ఒకే రకం పంట వేసి ఇబ్బంది పడొద్దని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని ఆయన…