నేటి సమాజంలో ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది. అలాగే మోసాలు కూడా పెరిగిపోయాయి. చిన్న, మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికీ ఉండే ఆశ సొంతిల్లు. అయితే ఎంతో కష్టపడి డబ్బుదాచుకొని, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని మరీ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన ఇల్లుకు సంబంధించిన డాక్యుమెంట్లు నకిలీవి అని తెలిస్తే వారి పరిస్థితి వర్ణనాతీతం. ఇలాంటి సంఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. మల్లంపేట్ సర్వే నంబర్ 170/3, 170/4, 170/5 లోని బఫర్ జోన్‌లో శ్రీలక్ష్మి శ్రీనివాసా విల్లాస్ అక్రమ నిర్మాణాలు చేపట్టిందని స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపట్టి, మల్లంపేట్ శ్రీలక్ష్మి శ్రీనివాసా విల్లాస్ లో అక్రమ నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు.
Also Read : ఆ ముఠా టార్గెట్ SBI ఏటీఎంలే..
60 విల్లాలకు అనుమతులు తీసుకున్న సంస్థ 325 విల్లాలు నిర్మించినట్లు తెలిపారు. కొన్ని విల్లాలకు మాత్రమే హెచ్‌ఎండీఏ అనుమతులు ఇచ్చినా, గ్రామ పంచాయతీ నుంచి అనధికారిక ఫోర్జరీ అనుమతి పాత్రలు సృష్టించి కట్టడాల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చెరువు పక్కనే బఫర్ జోన్ లో నిర్మించిన విల్లాలను అధికారులు కూల్చేశారు. సరైన ధృవపత్రాలతో సంస్థ నిర్వాహకులు తమ ముందు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో కోట్ల రూపాయలు పెట్టి విల్లాలు కొనుగోలు చేసిన బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.