ట్రిపుల్ ఆర్ తర్వాత టాలీవుడ్‌లో మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు స్టార్ హీరోలు. ఈ నేపథ్యంలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ తెరపైకొస్తున్నాయి. అందులోభాగంగా.. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ-విక్టరీ వెంకటేష్ హీరోలుగా.. ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా రాబోతోందని తెలుస్తోంది. అందుకోసం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రంగం సిద్దం చేస్తున్నాడట. గతంలో వెంకటేష్, మహేష్ బాబుతో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాను మల్టీస్టారర్‌గా తెరకెక్కించి మెప్పించాడు శ్రీకాంత్. ఇక చివరగా…
కొన్ని కాంబినేషన్స్ భలేగా ఉంటాయి.. ట్రిపుల్ ఆర్ తర్వాత టాలీవుడ్‌లో కొన్ని ఊహించని కాంబోలు.. మల్టీ స్టారర్స్ సెట్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణ.. యాంగ్రీమెన్ రాజశేఖర్ కలిసి నటించబోతున్నారనే క్రేజీ న్యూస్ వైరల్‌గా మారింది. గతంలోనే ఇలాంటి వార్తలొచ్చినా.. ఇప్పుడు ఇది ఫిక్స్ అనే టాక్ నడుస్తోంది. ఇంతకీ బాలయ్య సినిమాలో రాజశేఖర్ పాత్రేంటి..! చివరగా ‘అఖండ’తో భారీ సక్సెస్ అందుకున్న బాలయ్య.. అదే టైంలో ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షోతో దుమ్ముదులిపారు.…
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు సాయి శ్రీనివాస్ ఇప్పటికే టాలీవుడ్ లో హీరోగా పలు చిత్రాలలో నటించాడు. ఇప్పుడు సురేశ్ రెండో కుమారుడు గణేశ్ సైతం హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. గణేశ్ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ‘స్వాతి ముత్యం’ పేరుతో ఓ సినిమా నిర్మిస్తున్నారు. వర్ష బొల్లమ్మ ఇందులో హీరోయిన్. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం…