వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఉప్పెన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మెగా అల్లుడు.. వరుసగా సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల కొండ పొలం సినిమాతో మాస్ ఆడియన్స్‌ను సైతం తన వైపు లాగేసుకున్న వైష్ణవ్ తేజ్.. ఇప్పుడు ఫ్యామిటీ ఎంటర్‌టైనర్‌తో ముందుకు రానున్నాడు. అయితే ప్రస్తుతుం వైష్ణవ్ తేజ్ నటిస్తున్న సినిమా ‘రంగ రంగ వైభవంగా’. ఈ సినిమాలో అందాల భామ కేతిక శర్మ వైష్ణవ్ తేజ్‌కు జంటగా నటిస్తోంది. అయితే.. రొమాంటిక్ లవ్ స్టోరీతో వస్తున్న ఈ సినిమాను గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని బీవీఎస్ ఎన్ ప్రసాద్ తెరకెక్కిస్తుండగా.. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
అయితే… ఈ సినిమానుతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ లభించింది. అయితే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ఆద్యంత్యం వినోదభరితంగా సాగింది. ట్రైలర్ ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. అయితే ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ.. వైష్ణవ్ తేజ్ ఖాతాలో మరో హిట్ పడినట్టే అంటున్నారు.