యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా ‘ఎన్టీఆర్ 30′(#NTR30). ‘జనతా గ్యారేజ్’ కాంబోని రిపీట్ చేస్తూ కొరటాల శివతో కలిసిన తారక్, ‘ఎన్టీఆర్ 30’ మోషన్ పోస్టర్ తోనే తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో డైలాగ్ చెప్పి అనౌన్స్మెంట్ తోనే ప్రాజెక్ట్ పై భారి హైప్ క్రియేట్ చేశాడు. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఎన్టీఆర్ 30 అనివార్య కారణాల వల్ల డిలే అవుతూనే ఉంది. రీసెంట్ గా ‘టీం ఎన్టీఆర్ 30’ నుంచి దర్శకుడు కొరటాల శివ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టినట్లు కొన్ని ఫొటోస్ బయటకి వచ్చాయి. దీంతో త్వరలోనే ‘ఎన్టీఆర్30’ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని నందమూరి అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
డిసెంబర్ సెకండ్ లేదా థర్డ్ వీక్ లో ‘ఎన్టీఆర్30’ సెట్స్ పైకి వెళ్లొచ్చు అనే రూమర్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అఫీషియల్ గా ప్రకటన వచ్చే వరకూ ‘ఎన్టీఆర్30’ షూటింగ్ విషయంలో ఎలాంటి వార్త బయటకి వచ్చినా అది రూమర్ గానే కన్సిడర్ చేయాల్సి వస్తోంది. ఈ మోస్ట్ అంటిసిపేటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఎన్టీఆర్ పక్కన నటించే హీరోయిన్ కోసం కొరటాల శివ చాలా కాలంగా వెతుకునే ఉన్నాడు. కొంతమంది బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇంకా ఎవరూ ఫైనల్ అవ్వలేదు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ 30 అనే హాష్ టాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది(#NTR30). ఎన్టీఆర్ రీసెంట్ గా చేసిన ఒక యాడ్ షూట్ నుంచి ఒక ఫోటో బయటకి రావడమే ఈ ట్విట్టర్ ట్రెండ్ కి కారణం. ఈ ఫోటోలో ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఉన్నంత స్టైలిష్ గా ఉన్నాడు. దీంతో ఎన్టీఆర్ ఫోటోని షేర్ చేస్తున్న నందమూరి అభిమానులు ‘క్లాస్ లుక్ లో ఉన్న మాస్ హీరో’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.