Thank You Movie Promotions at Vijayawada.
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా సినిమా థాంక్యూ. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని రేపు విడుదల కానుంది. అయితే థాంక్యూ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడ లో థాంక్యూ మూవీ టీం సందడి చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. అభిమానుల కోసం ఏదో ఒక కొత్తదనాన్ని ప్రతి సినిమాలో చూపిస్తున్నామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా..
అభి, ప్రియా అనే క్యారెక్టర్ లు సినిమాని నడిపిస్తాయని ఆసక్తి కలిగించే విషయాన్ని వెల్లడించారు. రాశీఖన్నాతో వర్క్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందని ఆయన వివరించారు.నాకు ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ ఎక్కువ నచ్చుతాయని, మన జీవితంలో ఎవరెవరికో థ్యాంక్యూ చెప్పాలని చెప్పలేకపోతున్నాం కానీ ఖచ్చితంగా ఈ సినిమా చూశాక వారిని థాంక్స్ చెబుతామంటూ చైతు వ్యాఖ్యానించారు. ఈ చిత్రం నన్ను చాలా మార్చిందని, వ్యక్తిగతంగా నేను చాలా మారానన్నారు. నా ఫీలింగ్స్ అని నాలో నేను దాచుకునేవాడినని, ఈ చిత్రం తర్వాత ఓపెన్ అవుతున్నానన్నారు. నాగచైతన్య తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్, దర్శకుడు విక్రమ్ కుమార్, రైటర్ రవి కూడా ఉన్నారు.