రోజురోజుకూ మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. భార్యాభర్తల మధ్య.. అన్నదమ్ముల మధ్య.. తల్లిదండ్రుల మధ్య.. ఇలా రక్తసంబంధాలు దెబ్బతింటున్నాయి. తమ సుఖం కోసం రక్తబంధాన్ని తెంచుకోవడం కోసం ఏ మాత్రం వెనుకాడడం లేదు. తాజాగా ప్రియుడితో సుఖానికి అడ్డుగా ఉందని మూడేళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా చంపేసింది ఓ మాతృమూర్తి. ఈ దారుణం రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
కర్ణాటకలో దారుణం జరిగింది. తన ప్రేమను తిరస్కరించిందని ఒక వివాహితుడు స్నేహితురాలిని సరస్సులోకి తోసేసి చంపేశాడు. ఈ సంఘటన బుధవారం హసన్ జిల్లాలోని చందనహళ్లి ప్రాంతంలో జరిగింది.
గుజరాత్‌లోని వడోదర హర్ని సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. అందులో 14 మంది చిన్నారులతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. పడవలో మొత్తం 27 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారని, వారిలో ఎవరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అంటున్నారు. విహారయాత్ర కోసమని పాఠశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బంది ఇప్పటి వరకు ఏడుగురు విద్యార్థులను రక్షించగా, తప్పిపోయిన వారికోసం గాలింపు…
గుజరాత్‌లోని వడోదరలో తీవ్ర విషాదం నెలకొంది. హర్ని సరస్సులో పడవ బోల్తా పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. పడవలో ఉన్న వారు ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. మొత్తం పడవలో 27 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. వారిలో ఎవరూ కూడా లైఫ్ జాకెట్లు ధరించలేదని సమాచారం అందుతోంది. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సరస్సులో మునిగిపోయిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు…
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖల మంత్రి పురుషోత్తం రూపాల ప్రమాదం నుంచి బయటపడ్డారు. కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న పడవ ఆదివారం సాయంత్రం ఒడిశాలోని చిలికా సరస్సులో రెండు గంటల పాటు చిక్కుకుపోయింది. వెంటనే స్పందించిన సిబ్బంది చిలికా సరస్సులోకి మరో పడవను పంపి.. మంత్రిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. మత్స్యకారులు వేసిన వలలో పడవ ఇరుక్కుపోయి ఉంటుందని ముందుగా అనుమానించగా.. తాము దారి తప్పిపోయామని మంత్రి పురుషోత్తం స్పష్టం చేశారు. 11వ దశ ‘సాగర్ పరిక్రమ’…
అమెరికాలోని కాలిఫోర్నియాలో సూట్‌కేస్‌లో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సరస్సులో చెత్తను తొలగిస్తుండగా పారిశుద్ధ కార్మికులకు కంటపడింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. మంగళవారం ఉదయం ఓక్లాండ్‌లోని సరస్సును శుభ్రం చేస్తుండగా పారిశుద్ధ్య కార్మికులకు నీటిపై తేలుతూ సూట్‌కేస్ కనిపించింది.
నాగ్‌పూర్‌లో విహారయాత్రకు వెళ్లిన ఐదుగురు సరస్సులో మునిగి మృతి చెందగా, మృతదేహాలను అర్థరాత్రి బయటకు తీశారు. ఆదివారం సాయంత్రం ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఐదుగురు వ్యక్తులు సరస్సులో మునిగిపోయారు.
car caught fire: రంగారెడ్డి జిల్లా గండిపేట ఎంజీఐటీ కళాశాల వద్ద నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కారు మొత్తానికి మంటలు అంటుకున్నాయి.
Minister KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్ అకౌంట్ కు ఒక విచిత్రమైన కంప్లైంట్ వచ్చింది. చెరువు మాయమైందంటూ ఫ్యూచర్ ఫౌండేషన్స్ సొసైటీ ప్రతినిధులు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో చేసిన ఫిర్యాదు చేశారు.