Dead body in drum: హైదరాబాద్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డ్రమ్ములో మృతదేహం మిస్టరీని పోలీసులు ఛేదించారు. మృతుడు పురాన్ సింగ్‌గా గుర్తించారు. పురాన్ సింగ్ హత్యకు మాజీ ప్రియురాలి కారణమని పోలీసులు తేల్చారు. నగరంలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన డ్రమ్ములో మృతదేహం కేసును పోలీసులు విచారించారు. డ్రమ్ములోని మృతదేహం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పురాన్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు.
ఈ ఏడాది మే 22న పురాన్ సింగ్ మిస్సింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో పురాన్ సింగ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే గత నెల 25న చెరువులోని డ్రమ్ములో పురాన్ సింగ్ మృతదేహం లభ్యమైంది. పూరన్ సింగ్ హత్యలో జయదేవి అనే మహిళ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జయదేవి, పురాన్ సింగ్ గతంలో ప్రేమించుకున్నారు. అయితే జయదేవిని కాదని పురన్ సింగ్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. పురాణా సింగ్‌కి ఇద్దరు పిల్లలు. పురాణా సింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పురాన్ సింగ్ నివాసం ఉంటున్నాడు. పానీ పూరి బండి నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఈ నెల 22న పూరన్ సింగ్ భార్య మమతాదేవి తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. పూరన్ సింగ్ ఆమెకు బదులుగా మరో యువతిని పెళ్లాడడంతో జయదేవికి పురాన్ సింగ్ పై కక్ష్య పెంచుకుంది. దీంతో జయదేవి హైదరాబాద్ చేరుకు రాజస్తాన్ కు చెందిన నజీమ్ అనే వ్యక్తిని ప్రేమలో పడేసింది. పురాన్ సింగ్‌తో ప్రేమ వ్యవహారం గురించి ప్రియుడు నజీమ్‌కు చెప్పింది. పూరన్ సింగ్‌ను చంపేయాలని ప్రియుడు నజీమ్‌ను కోరింది. దీంతో నజీమ్ తన ప్రియురాలి కోరికను తీర్చడానికి అంగీకరించాడు. నజీమ్ మైనర్ బాలుడి సహాయంతో పురన్ సింగ్‌ను పిలిపించాడు. పూరన్ సింగ్‌ను తన స్నేహితుడు సుగుణరామ్, జయదేవి సాయంతో నజీమ్ హత్య చేశాడు. పూరానా సింగ్ మృతదేహాన్ని డ్రమ్ములో పెట్టి చెరువులో పడేశారు. పురన్ సింగ్‌ను హత్య చేసిన నజీమ్, సూగుణారామ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. జయదేవితో పాటు మైనర్ బాలుడు పరారీలో ఉన్నాడని పోలీసుల తెలిపారు. జయదేవి, మైనర్ బాలుడికోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
Adah sharma : భారీ హిట్ కొట్టినా ఆ హీరోయిన్ ను పట్టించుకోని దర్శకులు..!!