Parshottam Rupala: చిలికా సరస్సులో చిక్కుకుపోయిన పడవ.. కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖల మంత్రి పురుషోత్తం రూపాల ప్రమాదం నుంచి బయటపడ్డారు. కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న పడవ ఆదివారం సాయంత్రం ఒడిశాలోని చిలికా సరస్సులో రెండు గంటల పాటు చిక్కుకుపోయింది. వెంటనే స్పందించిన సిబ్బంది చిలికా సరస్సులోకి మరో పడవను పంపి.. మంత్రిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. మత్స్యకారులు వేసిన వలలో పడవ ఇరుక్కుపోయి ఉంటుందని ముందుగా అనుమానించగా.. తాము దారి తప్పిపోయామని మంత్రి పురుషోత్తం స్పష్టం చేశారు.
11వ దశ ‘సాగర్ పరిక్రమ’ కార్యక్రమంలో భాగంగా మత్స్యకారులతో సమావేశం అయ్యేందుకు ఒడిశా పర్యటనకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల వచ్చారు. ఖుర్దా జిల్లాలోని బార్కుల్ నుంచి పూరీ జిల్లాలోని సతపదాకు పడవలో కేంద్ర మంత్రి బయల్దేరారు. మంత్రితో పాటు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, ఇతర స్థానిక పార్టీ నాయకులు కూడా పడవలో ఉన్నారు. చీకటి పడడంతో పడవ నడిపే వ్యక్తి కొత్త దారిలో వెళ్ళాడు. దీంతో వెళ్లాల్సిన దారి తప్పిపోయారు. చిలికా సరస్సు మధ్యలో నలబానా పక్షుల అభయారణ్యం సమీపంలో పడవ సుమారు రెండు గంటలపాటు చిక్కుకుపోయింది. మరో పడవలో మంత్రి సురక్షితంగా ఒడ్డుకు వచ్చారు.
Also Read
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
‘చీకటి పడింది. పడవ నడిపే వ్యక్తి కొత్త మార్గంలో వెళ్లాడు. మేము దారి తప్పిపోయాము. సతపద చేరుకోవడానికి మాకు మరో రెండు గంటలు పట్టింది’ అని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల విలేకరులతో చెప్పారు. పూరీ జిల్లాలోని కృష్ణప్రసాద్ ఏరియా సమీపంలో జరిగే కార్యక్రమానికి మంత్రి హాజరు కావాల్సి ఉండగా.. ఈ ఘటన కారణంగా ఆ కార్యక్రమం రద్దయింది. కేంద్ర మంత్రి రాత్రి 10.30 గంటలకు పూరీకి చేరుకున్నారని ఓ అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!