KTR: నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్..
- ఫార్ములా ఈ-రేస్ కేసులో నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్
- రేపు ఈడీ విచారణకు మాజీ మంత్రి
- ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. మరోవైపు.. రేపు ఈడీ విచారించనుంది. ఫార్ములా ఈ రేస్ కేసుల్లో ఈ రెండు సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఏసీబీ నమోదు చేసిన కేసులో కేటీఆర్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో.. ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని శుక్రవారం నోటీసులు జారీ చేశాయి. విదేశీ సంస్థకు నిధుల మళ్లింపునకు సంబంధించి ఏసీబీ ప్రశ్నించనుంది. ఈ క్రమంలో కేటీఆర్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఎఫ్ఈఓకు రూ.45.71 కోట్ల చెల్లింపులో ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఆర్బీఐ అనుమతి లేకుండానే నిధులు బదిలీ చేసినట్లు గుర్తించారు. దీంతో.. కేటీఆర్‌తో పాటు, బీఎల్‌ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్‌లకు కూడా నోటీసులు జారీ చేశారు. కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత వారిని కూడా విచారించే అవకాశం ఉందని సమాచారం.
Read Also: CM Chandrababu: నేడు కుప్పంకు సీఎం చంద్రబాబు.. ‘స్వర్ణ కుప్పం-విజన్ 2029’కు శ్రీకారం!
Also Read
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
- Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
- Ram Lakshman Masters: 'ది ప్యారడైజ్' సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
- Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
ఈ కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్న హెచ్‌ఎండీఏ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. గడువు కావడంతో వారు ఈమెయిల్ ద్వారా అభ్యర్థన పంపారు. ఈ నేపథ్యంలో వీరి విచారణను తాత్కాలికంగా వాయిదా వేసి, కొత్త తేదీలతో ఈడీ అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఫార్ములా-ఈ రేసు నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం లేకుండా, ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే నిధులు మళ్లించారనే ఆరోపణలతో, మాజీ మంత్రి కేటీఆర్, హెచ్‌ఎండీఏ పూర్వ కమిషనర్ అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి పై అవినీతి నిరోధకశాఖ కేసు నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ కేసులో ఈనెల 7న హాజరుకావాలని కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే.. ఈ నేపథ్యంలో ఏసీబీ సైతం నోటీసులు జారీ చేయడంతో ఫార్ములా ఈ రేసు కేసులో సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
Read Also: MARCO : రూ. 100 కోట్ల క్లబ్ లో ఉన్ని ముకుందన్ ‘మార్కో’
తాజావార్తలు
-
Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
-
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!