హైదరాబాద్ రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ నుంచి మాజీ మంత్రి కేటీఆర్.. నంది నగర్లోని తన ఇంటికి చేరుకున్నారు. కాసేపట్లో ఏసీబీ ఆఫీస్‌కు వెళ్లనున్నారు. మరోవైపు.. కేటీఆర్ ఇంటి వద్ద మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్క సుమన్, మెతుకు ఆనంద్, పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు. కేటీఆర్ ఏసీబీ విచారణలో భాగంగా నేతలంతా అక్కడకు చేరుకున్నారు.
Read Also: Chandragiri Accident: యాక్సిడెంట్ ఎలా జరిగిందో అర్థం కావడం లేదు: అంబులెన్స్ డ్రైవర్
మరోవైపు.. ఏసీబీ ఆఫీస్‌కు కేటీఆర్ వస్తున్న సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీబీ ఆఫీస్‌కు వచ్చే రెండు దారుల వద్ద అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీబీ ఆఫీస్‌కి రెండు వైపులా ఎంట్రెన్స్‌ల వద్ద భారీకేడ్ల ఏర్పాటు చేశారు. ఏసీబీ ఆఫీస్ కు కేటీఆర్ వచ్చే సమయంలో ఆయన వాహనాన్ని మాత్రమే లోపలికి అనుమతిచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో స్థానిక పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్, టీఎస్ఎస్‌పీ, ఏఆర్‌తో పాటు అదనపు బలగాలతో బందోబస్తు నిర్వహించారు. ఇదిలా ఉంటే.. కేటీఆర్‌ను విచారణలో భాగంగా ఏసీబీ డీజే విజయ్ కుమార్, డైరెక్టర్ తరుణ్ జోషి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో కేటీఆర్ ఏసీబీ ఆఫీసుకు వెళ్లనున్నారు.
Read Also: Justin Trudeau: కెనడాలో అంతర్గత తిరుగుబాటు.. రాజీనామా చేసే యోచనలో జస్టిన్ ట్రూడో..?