తెలంగాణలో బీఆర్ఎస్ శకం ముగిసిందని.. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్ పార్టీనే ఉండదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ జోస్యం చెప్పారు. ఆదిలాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారన్నారు. తండ్రీకొడుకులు తప్ప బీఆర్ఎస్‌లో ఎవ్వరూ ఉండరని పేర్కొన్నారు. దొరికిపోయిన దొంగ కేటీఆర్ అని.. ఆయన జైలుకు పోక తప్పదని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో దోపిడీకి అసలు అడ్డులేకుండా పోయిందని ఆరోపించారు. ప్రభుత్వ సొమ్ము తిన్న వారికి శిక్ష తప్పదన్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో పెద్ద క్రైమ్ చేశారని.. కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని పూడ్చేపనిలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Survival Story : 438 రోజులు సముద్రం మధ్యలో ఎలా సర్వైవ్ అయ్యాడు?
అధికారం కోల్పోయిన అక్కసుతో దారుణంగా మాట్లాడుతున్నారు. ఒక్క కుర్చీ కోసం ముగ్గురు కొట్లాడుతున్నారు. అధ్యక్ష పదవి కోసం ఆ ముగ్గురు పోటీ పడుతున్నారు. హరీశ్ రావు వేరే పార్టీ చూసుకోవాల్సిందే. ఈ-కారు రేస్‌లో కేటీఆర్ అడ్డంగా దొరికారు. పనికి రాని కేసు అంటూనే కేటీఆర్ ఎందుకు బయపడుతున్నారు. కాళేశ్వరం వృథా ప్రాజెక్టు. ప్రపంచంలోనే అత్యంత ప్రజా ధనం దుర్వినియోగం, దోపిడీ చేసిన కుటుంబం కేసీఆర్ కుటుంబం. వాళ్ల పాలనలో దోపిడీ లేని రంగం లేదు. ఫాంహౌస్‌కు పరిమితం అయినా కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా అవసరమా? బీజేపీ మతం పేరిట ఓట్లు అడుగుతుంది. కులం, మతం పేరిట ఓట్లు అడగడం వల్ల రాబోయే తరాలు ఇబ్బంది పడతారు.’’ అని మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: JIO Recharge: న్యూ ఇయర్ సందర్భంగా మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించిన జియో