Raghunandan Rao : ఇవాళ బీజేపీ కార్యాలయంలోపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ దాడిపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై గూండాలు రౌడీషీటర్లు కాంగ్రెస్ కార్యకర్తల ముసుగులో దాడి చేశారని, ఈ దాడికి రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ బాధ్యత వహించాలన్నారు రఘునందన్ రావు. నిన్న ఒకే వేదికపై ఓవైసీ సోదరులతో వేదిక పంచుకోగానే రేవంత్ రెడ్డి అక్కడే ఈ దాడికి పథకాన్ని రచించారని, గతంలో తమ సొంత ముఖ్యమంత్రిని దించడం కోసం చెప్పులు వేయడం మత కల్లోలాలు సృష్టించడం వారి చరిత్రలో భాగమే అని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బీజేపీ కార్యాలయంపై పోలీసులే దగ్గరుండి దాడి చేయించినట్టుగా కనబడుతున్నదని, ఢిల్లీలో మా మాజీ ఎంపీ పొరపాటున దొర్లిన ఒక పదానికి వెంటనే వెనక్కి తీసుకొని తన హుందాతనాన్ని ప్రదర్శించారన్నారు.
కానీ నకిలీ గాంధీ కుటుంబ సభ్యుల కోసం ఇక్కడ కొందరు రౌడీషీటర్లు కాంగ్రెస్ ముసుగులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా సన్నగిల్లిపోయినాయని, గుండాలకు, రౌడీషీటర్లకు, ఉగ్రవాదులకు, నక్సలైట్లకు పూర్తి స్వేచ్చని ఇచ్చి తెలంగాణను కుక్కలు చింపిన విస్తరి చేయమని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు చెప్పారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయంపై, కార్యకర్తలపై, నాయకులపై దాడులకు పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు క్షమాపణ చెప్పాలన్నారు. మా ఓపికను సహనాన్ని పరీక్షించాలి అనుకుంటే అది మీ ఇష్టమని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం బీజేపీ కార్యాలయం పై దాడితో మొదలైంది గుర్తుపెట్టుకోండన్నారు రఘునందన్ రావు.
Purandeswari: విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్దరణపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే.. బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి మాట్లాడుతూ.. బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నానన్నారు. కేసీఆర్ ఓడిపోయాక ఈ సంస్కృతి పోయిందని అనుకున్నా అని, మా పార్టీ తెలంగాణ నుంచి కాశ్మీర్ వరకు ఉంది. తిరగబడి దాడి చేస్తే మీ పరిస్థితి ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. మేము రియాక్ట్ అయితే.. మీ జాతీయ నాయకులు దాక్కోడానికి కూడా ప్లేస్ దొరకదు. ఇదే మొదటి, చివరి హెచ్చరిక అని ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ – కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకున్నారు.. వాళ్లు ఇంకా సీఎం, మంత్రి అన్న భావనలో ఉన్నారన్నారు. అడ్వకేట్ లను తీసుకొస్తా అని కేటీఆర్, నా ఇంట్లో విచారణ చేయాలని కవిత విచారణ అధికారుల ముందు డిమాండ్లు పెడుతున్నారని, కేసీఆర్ ఉద్యమం చేసినందుకు గౌరవించవచ్చు.. కానీ ఆయన కొడుకు, కూతురు కారణంగా నష్టపోయారన్నారు. కేటీఆర్ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయని, చర్లపల్లా లేక తీహార్ జైలా అన్నది ఆయన ఎంచుకోవాలన్నారు. కేటీఆర్ జైలుకు వెళ్ళక తప్పదని ఆయన జోస్యం చెప్పారు.
UP News: న్యూ ఇయర్ రోజు ప్రేయసిని కలిసేందుకు వచ్చాడు.. ఆ తర్వాత దారుణం..