ఓపెన్ విత్ స్పాట్ సీఎం సీఎం నినాదాలు నిన్న కేసీఆర్ బీఆర్ఎస్ ఆఫీస్‌కు వచ్చినప్పుడు చేసినవి ఇవే.... ఈ నినాదాలే..... ఇప్పుడు బీఆర్ఎస్లో చర్చకు కారణం అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే... ఇదెక్కడి గోలరా...బాబూ... అంటూ పార్టీ పెద్దలే తలబాదుకుంటున్న పరిస్థితి. మామూలుగా అయితే... రాజకీయ నాయకులకు మీటింగ్స్‌లో ఇలాంటి నినాదాలు మాంఛి కిక్కు ఇస్తాయి. కానీ... బీఆర్ఎస్లో మాత్రం.... ఎవర్రా మీరు.... అసలెవర్రా మీరంతా.... అంటూ నినాదాలు చేస్తున్నవారిని కోపగించుకోవాల్సిన పరిస్థితి వస్తోందట.
Aadi Srinivas : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ బరితెగించి ముందుకు పోతుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ భవనంలో ప్రెస్ మీట్లో అధికారుల పట్ల వ్యాఖ్యలు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశామని ఆయన వెల్లడించారు. సోషల్ మీడియాలో జిల్లా కలెక్టర్ మీద అనేక ఆరోపణ చేస్తున్నారని…
కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు చాలా విస్తృతంగా సమావేశం జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏడాది పాటు బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ నాటికి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. "ఈ రోజు చాలా విస్తృతంగా, సుదీర్ఘంగా సమావేశం పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మా పార్టీ ముఖ్యులు 30 మంది మాట్లాడారు. తెలంగాణకు ఏనాటికైనా బీఆర్ఎస్సే రక్షణ…
శాసన మండలిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. కేటీఆర్ రైతు దీక్షపై కౌంటర్ ఎటాక్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతు దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు.
KTR : తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు సంబంధించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని బీజేపీ అపార్థం చేసుకోవడం దారుణమని, తాము ప్రజా సంక్షేమం కోసం చేసిన ఖర్చును అప్పుగా చిత్రీకరించడం అన్యాయమని మండిపడ్డారు. కేటీఆర్ తన బహిరంగ లేఖలో, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 65 ఏళ్లలో 14 ప్రధానులు కలిసి రూ.56 లక్షల కోట్ల అప్పు చేసినా, బీజేపీ ప్రభుత్వం కేవలం…
ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘనపూర్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం బీఆర్ఎస్ నాయకులు,శ్రేణులపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. ‘అధికారం లేకపోవడంతో… బిఆర్ఎస్ నాయకులు మతిభ్రమించి, పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. పదవి, అధికారం లేకుండా ప్రజలకు సేవ చేసే అలవాటు బిఆర్ఎస్ శ్రేణులకు లేదు అని మండిపడ్డారు. పత్రికా సమావేశాలు పెట్టి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడమే ప్రతిపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. Also Read: Zee…
KTR : కాంగ్రెస్ సర్కారు చేసిన కులగణన సర్వే తప్పుల తడక అని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే బీసీల జనాభాను తగ్గించి వెనకబడిన వర్గాల ప్రజలను తీవ్ర మానసిక వేదనకు గురిచేసినందుకు ముఖ్యమంత్రి రాష్ట్రంలోని బీసీలందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. అసమగ్రంగా చేసిన సర్వేపై బీఆర్ఎస్ తోపాటు.. బీసీ సంఘాలు ముక్తకంఠంతో అభ్యంతరం వ్యక్తంచేసినా వినకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తి లెక్కల ఆధారంగా అసెంబ్లీలో…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారా? ఆయన ఏదో చేయబోతే… అది ఇంకేదో అయిపోయి ఇరుకున పడేసిందా? కాంగ్రెస్ పార్టీకి అడ్డంగా బుక్కయిపోయారా? ఆ పార్టీ శ్రేణులు ఇప్పుడాయన్ని సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటున్నాయా? ఇంతకీ… ఏ విషయంలో ఇరుక్కుపోయారు కేటీఆర్? కాంగ్రెస్ పార్టీ ఎలా సోషల్ రివెంజ్ తీసుకుంటోంది? ఈ రైతు ఆవేదన వీడియోని ఎక్స్‌లో పోస్ట్ చేసిన కేటీఆర్… రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడమంటూ జనం మీదికి వదిలారు.…
EVM లోని డేటాని తొలగించొద్దు.. ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు.. కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఈవీఎం నుంచి డేటాను తొలగించవద్దని కోరూతూ దాఖలైన పిటిషన్‌పై, పోలింగ్ ముగిసిన తర్వాత ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాల(EVM) స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ఏమిటి అని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతానికి ఈవీఎంల నుంచి ఎలాంటి డేటా తొలగించవద్దని, ఏ డేటాని రీలోడ్ చేయవద్దని కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కీలక…
TPCC Mahesh Goud : కేటీఆర్‌కి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన … ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా కేటీఆర్? అంటూ కేటీఆర్‌కు మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్ చేశారు. కేటీఆర్ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలకడం ఆపేసి.. దమ్ముంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయండన్నారు. చెల్లి, బావ ఇచ్చిన షాక్ తో కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని ఆయన హెద్దెవ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ…