డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శాసన సభలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26 ను ప్రవేశపెట్టారు. రూ. 3 లక్షల 4 వేల 965 కోట్ల బడ్జెట్ ను రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడుతు.. “రాష్ట్రంలో రైతులు, ప్రజలు ఎదురు చూశారు.. కానీ ఆరు గ్యరెంటీలు గోవిందా అని అర్థం అయ్యింది.. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది రెండో బడ్జెట్ ప్రతిపాదన.. ఇందులో 420 హామీల్లో ఒక్క గ్యారంటీపై కూడా మాట్లాడలేదు.. 4000 పెన్షన్ మరిచి పోయారు.. మహిళలకు ప్రకటించిన మహాలక్ష్మి ప్రకటించలేదు.
Also Read:Congress Govt: మహిళలను కోటీశ్వరులు చేసేలా మా పథకాలు..
ఆటో డ్రైవర్లు అవస్థలు పడుతుంటే.. వారికి ఉపశమనం కల్పించే మాట కూడా మాట్లాడలేదు.. స్విగ్గీ, zomato వర్కర్లకు వర్కర్స్ బోర్డు అన్నారు మర్చిపోయారు.. ఆడ బిడ్డలకు తీరని అన్యాయం చేశారు.. 500 రోజులు పూర్తయినా కూడా రూ. 2500 ఇవ్వలేదు.. యాదవులకు గొర్రెలు అన్నారు.. పట్టించుకోలేదు.. గౌడులకు మద్యం దుకాణాల్లో ప్రత్యేక వాటా అన్నారు మోసం చేశారు.. అశోక్ నగర్ లో చాయితాగుతూ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాందీ ఫోజులు కొట్టారు.. ఉద్యోగాలు భర్తీ చేయలేదు.. రాహుల్ గాంధీ దమ్ముంటే ఇప్పుడురా అశోక్ నగర్ కు అని సవాల్ విసిరారు.
Also Read:Lokesh : LCU ప్రాజెక్టులపై లోకేశ్ కనగరాజ్ ఫోకస్
విద్యా భరోసా అన్నారు.. ఇవ్వలేదు.. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతుంటే పట్టించుకోవడం లేదు.. పేక మేడల్లాగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేస్తున్నారు.. తెలంగాణ కు కాంగ్రెస్ వైరస్ సోకింది.. ఇది దేశానికే సిగ్గు చేటు పాలన.. ఇది డిల్లీకి మూటలు పంపే బడ్జెట్.. మూసి ప్రక్షాళన పేరుతో డిల్లీకి మూటలు మోస్తున్న పాలన.. ఏ ఒక్క ఊరిలో 100 శాతం రుణ మాఫీ జరిగినట్లు చూపించినా మా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు.. కానీ ప్రభుత్వానికే ఎక్కడ ఎంత రుణ మాఫీ జరిగిందో స్పష్టత లేదు.. రోజూ రంకెలు వేయడం కాదు.. అంకెలు ఎందుకు మారాయో మీడియా ముందు చెప్పాలి రేవంత్ రెడ్డి.. నమ్మి ఓటు వేసిన పాపానికి ప్రజలను ముంచిన బడ్జెట్ ఇది.. రేవంత్ రెడ్డి అసమర్ధత వల్ల ఆర్థిక వ్యవస్థ పడిపోతుందన్నారు.
Also Read:Bhatti Vikramarka: కుల మతాలతో సంబంధం లేకుండా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో విద్యాభ్యాసం..
లక్షా 60 వేల కోట్లు అప్పు చేసి ఒక్క ప్రాజెక్టు కూడా మొదలు పెట్టలేదు.. తొండ ముదిరితే ఊసరవెల్లి అయినట్లు.. ఊసరెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అవుతాడు.. కార్యకర్తలకు 6 వేల కోట్ల పంచి పెడతాం అంతే అది యువ వికాసం కాదు.. డిల్లీ వికాసం అవుతుంది.. రాష్ర్టంలో ఎవరు ఆనందంగా ఉన్నారని అందాల పోటీలు పెడుతున్నారు.. ఆరు గ్యారెంటీలకి ఎగనామం పెట్టే బడ్జెట్ లా ఉంది.. ఇది చేతకాని చెత్త బడ్జెట్ గా మేము భావిస్తున్నాం..” అని కేటీఆర్ మండిపడ్డారు.