తెలంగాణ అసెంబ్లీలో కాసెపట్లో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ రేవంత్ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించింది. రైతులకు మద్దతుగా ఎండిన వరిగడ్డితో అసెంబ్లీకి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. “రాష్ర్టంలోని రైతన్నల్లో ధైర్యం నింపడానికి బిఆర్ఎస్ ముందుకు వచ్చింది.. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో ఎండిపోతున్న పాటలను ప్రభుత్వం దృష్టికి తేవడానికి ఎండిన వరి గడ్డితో అసెంబ్లీ కి వచ్చాము.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా 480 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
Also Read:Hema : శివగామి లాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేయను..
కేసీఆర్ పై కోపంతో మేడిగడ్డని ఎండబెడుతున్నారు. అక్కడ ఇసుక దందా చేస్తున్నారు.. చంద్రబాబు మీద ప్రేమతో కిందికి నీళ్ళు విడిచింది ప్రభుత్వం. ఇక్కడ తెలంగాణ రైతుల పంటలను ఎండబెట్టారు.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు..రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు.. ముందు చూపు లేని దున్నపోతు ప్రభుత్వం. ఎండిన పంటలకు ఎకరానికి 25 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.. పంటలు ఎండడానికి కారణం ప్రభుత్వమే. దున్నపోతు లాంటి ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర లేపుతున్నాం. 6వందల కోట్ల పంట నష్టం ఒక్క జనగామలో జరిగింది.
Also Read:KCR: ఈసారి బడ్జెట్ సమావేశానికి గైర్హాజరు అవనున్న ప్రతిపక్ష నేత
పంట నష్టపోవడానికి కారణం ముందు చూపు లేని మూర్ఖపు సన్నాసి ప్రభుత్వం. పంటలు ఎండిన ప్రతి ఎకరానికి 25 వేల చొప్పున నష్టపరిహారం బడ్జెట్ లో కేటాయించాలి. చెరువులు, చెక్ డ్యాంలు నింపకపోవడమే పంటలు ఎండటానికి కారణం. చేసిన పాపానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి పాప పరిహారం చేసుకోవాలని రేవంత్ సర్కార్ పై కేటీఆర్ మండిపడ్డారు.