గతంలో కేటీఆర్ ఆదేశాలతో పోలీసులు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని బెడ్ రూమ్ లోపలికి చొచ్చుకొని వెళ్ళి అరెస్ట్ చేసి జైలుకి పంపారని.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ తనని అరెస్టు చేసిన పోలీసు అధికారులను ఏమి చేయడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. “మేము అధికారంలోకి వచ్చాక రిటైరైన పోలీసుల మీద కూడా చర్యలు తీసుకుంటాం” అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ స్పందించారు. పోలీసుశాఖతో పెట్టుకోవద్దు.. ఎవరు అధికారం ఉంటే వాళ్ళ మాటనే వింటారు. లీగల్ గానే పనిచేస్తారన్నారు. ఈ సందర్భంగా మరోసారి సొంత పార్టీ నాయకులపై విమర్శలు గుప్పించారు.
READ MORE: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. మరింత తగ్గిన బంగారం ధరలు
తాము అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఘటనలు మర్చిపోయారా? అని కేటీఆర్‌ను రాజాసింగ్ ప్రశ్నించారు. “మా బీజేపీ కార్యకర్తల పైన ఎన్నో కేసులు పెట్టి జైలుకి పంపారు. మా బీజెపి కార్యకర్తల పైన లాఠీ ఛార్జ్ చేశారు. నా పై పీడి యాక్ట్ పెట్టి జైలుకు పంపించారు. షాకింగ్ విషయం ఏంటంటే.. నా పై పీడి యాక్ట్ పెట్టి జైలుకు పంపించే సమయంలో మా బీజేపీ నేతలు పోలీస్ కి సపోర్ట్ గానే ఉన్నారు. “రాజాసింగ్ ! నీ పైన పిడి ఆక్ట్ వేస్తున్నాం. మీ బీజేపీ వాళ్లు కూడా వేయండి అన్నారు.” అని ఓ పోలీసు అధికారి నాకు చెప్పారు. మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారులను ఏం చేయాలి? ఈ రోజు కూడా చాలామంది బీజేపీ నాయకులు నన్ను ఎప్పుడు విన్నాపోటు పొడుద్దాం అనే ఆలోచనలో ఉన్నారు. నేను జైల్లో ఉన్నప్పుడు మా అన్న, మా కార్యకర్తలు నా వెంబడి నిలబడ్డారు. ఇవ్వాలా కూడా మా అన్న మా వెంబడే ఉన్నారని నేను అనుకుంటున్నాను. కానీ మా అన్న ఎటువైపు ఉన్నారో అర్థం కావడం లేదు.” అని గత బీఆర్ఎస్ హయంలో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
READ MORE: UP: యూపీలో మరో దారుణం.. ప్రియుడి కోసం పెళ్లైన 2 వారాలకే భర్తను చంపిన నవ వధువు