తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ పీసీసీ పదవి రూ. 50 కోట్లకు కొన్నడని కోమటి రెడ్డి అన్నడని చెప్పాడు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై కోమటి రెడ్డ రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షం లేకుండా చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు మాకు నీతులు చెప్తున్నారు అని ఎద్దేవ చేశారు. ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. మీకు నాయకుడే లేడు.. సభకు రావడమే మానేశారని తెలిపారు. ప్రజల సమస్యలు చెప్పడానికి సభకే రావడం లేదు. రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టి మీరు ఇంకా ఫామ్ హౌస్ లో ప్రశాంతంగా ఉన్నారు. లేకుంటే నిన్నటి నుంచి ఒకలెక్కా.. ఇవాళ్టి నుంచి ఇంకో లెక్క అన్నట్టు ఉండేది.
Also Read:Manchu Vishnu : ప్రభాస్ ఆ పనిచేస్తే నేను కన్నప్ప చేసేవాడిని కాదు : మంచు విష్ణు
సైరన్ సప్పుడు లెకుండా తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ లీడర్లు అందరి ఫోన్లు ట్యాప్ చేసి అధికార దాహానికి బలై పోయారు. అహంకారంతో సాగింది బీఆర్ఎస్ పాలన.. కేసీఆర్ పాలనలో 8 వేల హత్యలు.. లక్ష దొంగ తనాలు జరిగాయి. మేము ఆరుగురం ఉన్నప్పుడు మా గొంతు నొక్కారు. సభ మీ సొంతమా అని అడిగారు. ఇప్పుడు నేను అడుగుతున్న.. సభ మీ సొంతమా మరి.. వచ్చినప్పటి నుండి ఒకటే గొడవ.. Brs గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.. ఆ టైమ్ ప్రజల కోసం కేటాయిస్తే చాలు అని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.