KTR : ప్రజలను తప్పుదారి పట్టించేందుకు నోటీసుల డ్రామా
- ‘పాలమూరు–రంగారెడ్డి విషయంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది
- సీఎం రేవంత్ రెడ్డికి ఒక వ్యాధి ఉంది.. కేటీఆర్ తీవ్ర విమర్శ
- నోటీసుల డ్రామా వెనుక అసలు ఉద్దేశం దేన్నో ప్రజలు అర్థం చేసుకోవాలి : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : తెలంగాణ రాజకీయాల్లో వేడి మరింత పెరుగుతున్న క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్… ప్రాజెక్టులు, కేసులు, బదిలీలు, నోటీసులు వంటి పలు అంశాలపై పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన ఆయన, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు నోటీసుల డ్రామా నడుస్తోందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఏమీలేదని సుప్రీం కోర్టు స్పష్టంగా తెలిపిందని కేటీఆర్ చెప్పారు. అదే విధంగా కాళేశ్వరం గురించి కూడా త్వరలో నిజాలు బయటపడతాయని అన్నారు. కేవలం రెండు పిల్లర్లు కూలిపోయిన అంశాన్ని బిగుతుగా పట్టుకుని దాన్ని రాజకీయంగా వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
Vijay Sethupathi : ఘనంగా జరిగిన ‘ఏస్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..
Also Read
- CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
- Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
- Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
- Nepal PM Balendra Shah: భారత్కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో స్థిరత లేదని, ఒక్కో రోజు ఒక్కో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘‘ఒక రోజు కాళేశ్వరం కూలేశ్వరం అంటారు, మరుసటి రోజు అక్కడినుంచి నీళ్లు తేవాలని చెబుతారు. సీఎం మాటల్లో విశ్వసనీయత లేదు’’ అని ఆరోపించారు. అలాగే SLBC ప్రమాదంపై ఒక్కరిపై అయినా చర్యలు తీసుకున్నారా అని ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కేసులు, నోటీసులు వచ్చాయని కేటీఆర్ ఆరోపించారు. ఇది మరో ‘‘లొట్టపీసు కేసు’’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘‘కమీషన్ గడువు ముగిసిన తర్వాత ఎందుకు పెంచారు? ఇదంతా కేవలం రాజకీయ బదులు తీయడానికే’’ అని మండిపడ్డారు. నిన్న ఈటెల రాజేందర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు.
ఇటీవల హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ ఈవెంట్ సందర్భంగా మంత్రులు టూర్ గైడ్‌లుగా మారిపోయారని విమర్శించారు. ‘‘ఒకవైపు మిస్ వరల్డ్ బ్యూటీస్, మరోవైపు నోటీసులతో కాలం వెళ్లదీస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి’’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో భారీగా పోలీస్ అధికారుల బదిలీలు జరగడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హోంశాఖ 30 మంది ఏఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని పలు అనుమానాలకు తావిచ్చే చర్యగా అభివర్ణించారు. ‘‘హెలికాప్టర్‌ను షేర్ ఆటోలా వాడుతున్నారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటివరకు కేసీఆర్‌కు నోటీసులు అందాయో లేదో కూడా తమకు స్పష్టంగా తెలియదని కేటీఆర్ చెప్పారు. అయితే అందితే హాజరుకావాలా లేదా అన్నదానిపై ఆలోచిస్తామని తెలిపారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సుప్రీంకోర్టు కూడా ఒక ఇంజినీరింగ్ అద్భుతంగా అభివర్ణించింది. దాన్ని రాజకీయంగా మలచే ప్రయత్నం బాధాకరం’’ అని కేటీఆర్ అన్నారు.
Viral: బైక్‌పై చెప్పుల పండుగ.. నెట్టింట్లో ‘భార్య ప్రతాపం’ వీడియో వైరల్..!
:
తాజావార్తలు
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!