కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బిజెపి కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు కేటీఆర్. సాగు చట్టాలను రద్దు చేయడం.. మోడీ క్షమాపణలు చెప్పడం ఎన్నికల స్టంటేనని బీజేపీ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. సాగు చట్టాలను రద్దు చేశామని మోడీ అంటారని… సాగు చట్టాలు మళ్లీ తెస్తామని కేంద్ర మంత్రి అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. బిజెపి రాజకీయాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు కేటీఆర్.
కాగా..ఇవాళ వ్యవసాయ చట్టాలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాలను మళ్లీ తెస్తామని… అయితే.. ఈ సారి సాగు చట్టాలను స్పల్ప మార్పులతో తెస్తామని ప్రకటన చేశారు. వ్యవసాయ సాగు చట్టాలపై ప్రస్తుతం కసరత్తు జరుగుతుందని.. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వస్తుందన్నారు.