ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాసటగా నిలిచారు. ట్విట్టర్‌లో కేటీఆర్‌ను, @TelanganaCMO ను ట్యాగ్ చేస్తు కోమటి రెడ్డి విమర్శలు చేశారు. విద్యార్థులు కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు.
ఈ మేరకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గుర్తుపెట్టుకో కేసీఆర్ @TelanganaCMO &@KTRTRS … ఇంటర్ బోర్డు ఫెయిల్ చేసిన విద్యార్థులందరికీ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు వస్తుంది…వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్న మీకు & మీ పార్టీకి వచ్చే ఎన్నికలలో బాధిత విద్యార్థులు తగిన బుద్ధి చెప్పడం కాయం అంటూ ట్వీట్ చేశారు. దీంతో మరోసారి ఇంటర్ బోర్డు పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు కరోనా కారణంగా గ్రామీణా ప్రాంతాల్లో విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు సరిగా జరగలేదని ప్రభుత్వం మరోసారి దీనిపై ఆలోచించాలని పలు డిమాండ్లువెల్లువెత్తుతున్నాయి.