ప్రధానిని, మంత్రులను కలిశాం.. ఎనిమిదో బడ్జెట్‌లోనూ ఏమీ ఇవ్వలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర బడ్జెట్‌పై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఎనిమిదో బడ్జెట్‌లో కూడా తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు.. ఒకవైపు పవర్లూం, చేనేత కార్మికులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది.. కానీ, కేంద్రం ప్రభుత్వం ఏడున్నార సంవత్సరాలుగా అండగా నిలబడండని కోరుతున్నా పట్టించుకోవడంలేదన్నారు.. సిరిసిల్లకు మెగా పవర్ రూమ్ క్లస్టర్ ఇవ్వండి అని అడిగినా మొండిచేయి చూపిస్తున్నారన్న ఆయన.. పవర్లూం క్లస్టర్ లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీలు అడిగినా ఇవ్వలేదన్నారు.. రాష్ట్రానికి జరుగుతున్న నష్టం కోసం పోరాడితే పోయేది ఏం లేదు అంటూ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని నేతన్నలకు సహాయం చేయాలనే సోయి కేంద్రానికి లేదంటూ మండిపడ్డారు కేటీఆర్.. జీఎస్టీ వేసి నేత పరిశ్రమను దెబ్బతీయాలని కేంద్రం చూస్తోందన్న ఆయన.. తాత్కాలికంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి వాయిదా వేశారు.. త్వరలోనే జీఎస్టీ వడ్డింపు తప్పదని జోస్యం చెప్పారు.. బడ్జెట్లో రాష్ట్రానికి మెండిచేయి చూపింది కేంద్రం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, చేనేత కార్మికులకు మద్దతుగా మాట్లాడిన ఎల్ రమణ అన్నకు ధన్యవాదాలు తెలుపుకున్న కేటీఆర్.. అన్ని అర్దర్లు ఇక్కడి చేనేత కార్మికులకె ఇస్తున్నాం.. ఆదుకోవాలని కేంద్రంకి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం.. వ్యవసాయం తర్వాత చేనేత రంగంపైనే ఎక్కువ ఆధారపడి ఉన్నారని ఎన్నోసార్లు చెప్పాం.. కానీ, ఎనిమిదో బడ్జెట్ లో కూడా ఏమి ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మనకు నష్టం జరుగుతున్నప్పుడు ఎదురు తిరగపడాల్సిందే.. తాత్కాలిక నిధులు ఇస్తామని చెప్పడం తప్ప కేంద్రం ఏమి చేయడంలేదని దుయ్యబట్టారు కేటీఆర్..
Also Read
- Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
- Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
తాజావార్తలు
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
-
Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!