పర్యావరణహిత చిన్నారి బ్లెస్సీకి మంత్రి కేటీఆర్ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిరిసిల్ల జిల్లా సుద్దాల కి చెందిన ప్రకృతి ప్రేమికుడు ప్రకాష్ కుమార్తె బ్లెస్సీ. తన పుట్టిన రోజు నాడు పర్యావరణ హిత కార్యక్రమం చేయాలని తలచింది. పచ్చదనాన్ని ప్రేమించే తండ్రినే స్ఫూర్తిగా తీసుకుని 65 వేల సీడ్ బాల్స్ స్వయంగా తయారుచేసింది. తాను తయారు చేసిన సీడ్ బాల్స్ కొన్ని సిరిసిల్ల అటవీ ప్రాంతంలో వెదజల్లింది. పర్యావరణంపై ప్రేమతో భావి తరాలకు స్ఫూర్తివంతంగా నిలుస్తున్న బ్లెస్సీని మంత్రి కేటీయార్, ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. స్వయంగా హైదరాబాద్ రమ్మని ఆహ్వానించారు. తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త ,ఎం పీ సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలు నాటి అరుదైన గౌరవాన్ని అందుకుంది. అనంతరం తాను తయారుచేసిన సీడ్ బాల్స్ ని ఎంపీ సంతోష్ కుమార్ కి బ్లెస్సీ బహూకరించింది. ఈ కార్యక్రమం అనంతరం బ్లేస్సిని మంత్రి కేటీఆర్ వద్దకు స్వయంగా తీసుకెళ్లిన ఎంపీ సంతోష్ కుమార్. చిన్నతనం నుండే ప్రకృతి పట్ల ప్రేమను నింపిన బ్లెస్సీ తల్లిదండ్రులు ప్రకాష్, మమత ని కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ఏ అవసరమొచ్చినా అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.
సీఎం కేసీఆర్ మానస పుత్రికైన హరితహారం, గ్రీన్ఇండియా చాలెంజ్ స్పూర్తితో చేపట్టిన కార్యక్రమాలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. రాబోయే తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని గుర్తు చేశారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం పిల్లల్లో కూడా చైతన్యం నింపడం పట్ల ఎంపీ సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. పిల్లల్లో ప్రకృతి పట్ల అవగాహన పెరగాలి, ప్రకృతి పట్ల ప్రేమను కనబరిచే చిన్నారులను ప్రోత్సహించాలి అని ఎంపీ సంతోష్ కుమార్ ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే తమ బిడ్డతో సీడ్ బాల్స్ తయారుచేయించామని బ్లెస్సీ తండ్రి ప్రకాష్ తెలిపారు. తమ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ ఆహ్వానించి గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనటం గొప్పవరంలా భావిస్తున్నామని ప్రకాష్ తెలిపారు.
Also Read
- Amit Shah Visits Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
- Amit Shah Hyderabad Visit: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన.. ‘ఇండియా’ కూటమికి కౌంటర్‌గా పాదయాత్ర.?
- Hyderabad: లక్ష్మీగూడలో విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఆత్మహత్య.!
- Rain Alert: తీవ్ర తుఫాన్‌గా బలపడిన మురసు.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
Met Shri @KTRTRS garu along with little Green Warrior Baby Blessy who hails from Siricilla constituency. Hon’ble Minister garu blessed on her birthday and hailed her for the amazing approach towards the nature and felt immensely happy as she gifted few #SeedBalls to him.#GIC🌱 pic.twitter.com/Cjh8lYgoPq
— Santosh Kumar J (@SantoshKumarBRS) January 31, 2022
Impressed by her incredible gesture on the occasion of her birthday, who decided to spread the 65000 seed balls, requested the parents of Baby to bring her to Hyderabad to wish her on her birthday today. Happy to plant saplings along with Blessy on her special day.#GIC 🌱. pic.twitter.com/ockaRpb5Bm
— Santosh Kumar J (@SantoshKumarBRS) January 31, 2022
తాజావార్తలు
-
Bigg Boss: హిందూ కంటెస్టంట్ తో ముస్లిం యువతి ప్రేమ.. బిగ్ బాస్ నుండి బయటకి రావాలని స్టేజెక్కిన పేరెంట్స్
-
CBFC : రిలీజ్ డేట్ ఉందంటూ హడావిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Amit Shah Visits Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
-
Amaravati Farmers: మా సమస్యలపై సీఎం స్పందించాలి.. 29 గ్రామాల రైతుల ఆవేదన!
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
ట్రెండింగ్
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!