తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. మోదీ ఆధ్యాత్మిక పురుషుడు.కేసీఆర్ చాలా తప్పులు మాట్లాడారన్నారు. ఆయన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆయన కొడుకుని, కూతుర్ని దింపేయమనండి రాజ్యాంగం మారిపోద్ది. ఫ్యామిలీ పార్టీలకు చెక్ పెట్టేందుకు రాజ్యాంగం రాసుకుంటూ పోతున్నాం అన్నారు.
ఫ్యామిలీ పార్టీ లను భారతదేశంలో ఉంచం. ఆంధ్ర రాష్టంలో మేము, మా మిత్రపక్షం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రణాళిక చేస్తున్నాం. రెండు యూనిట్ ల ఇసుక లారీ మేం ఐదువేలకే ఇస్తాం. చీమకుర్తి గ్రానైట్ ను ప్రజాపరం చేస్తాం.మోడీ ఇజం ఆంధ్ర రాష్ట్రానికి అవసరం అన్నారు సోము వీర్రాజు.
కాకినాడ కెమికల్ మెట్రో కాంప్లెక్స్ ఎప్పుడో ఇచ్చాం. ఇప్పటివరకూ నిర్మాణం చేపట్టలేదు. ఇది పూర్తయితే డైరెక్టుగా రెండులక్షలు, ఇండైరెక్టుగా నాలుగు లక్షల మంది ఉద్యోగాలు వస్తాయన్నారు. రాజ్యాంగం మార్చాలని సీఎం కేసీఆర్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ, ఇతర పార్టీలు కేసీఆర్ పై మండిపడుతున్నారు.