వైఎస్సార్‌సీపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహ వేడుకలో టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ సందడి చేశారు. ఈరోజు జరిగిన పెళ్లి వేడుకలో చిరంజీవి, బాలయ్య విడివిడిగా వేడుకకు విచ్చేశారు. బాలయ్య గోల్డెన్ కుర్తాలో కన్పించగా, చిరంజీవి క్లాసీ లుక్ లో కన్పించారు. చిరు, బాలయ్య పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్టార్ హీరోలిద్దరూ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక హైదరాబాద్ లోనే జరుగుతున్న ఈ పెళ్లి వేడుకకు బండ్ల గణేష్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
Read Also : Spider Man : మేడమ్ టుస్సాడ్స్‌లో హీరోయిన్ స్టాచ్యూ… ఫ్యాన్స్ ఫైర్
ఇక నిన్న చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి టిక్కెట్ ధరల విషయమై చర్చించిన సంగతి తెలిసిందే. కీలక భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన టాలీవుడ్ ప్రముఖులు సినీ పరిశ్రమ, థియేటర్ల యజమానుల సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఆహా సెలెబ్రిటీ టాక్ షోతో ‘అన్ స్టాపబుల్’ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి అలరించిన బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమాతో బిజీగా ఉన్నారు.