రూ.102 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులు ప్రారంభం చేసుకున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 56 రకాల ఆరోగ్య పరీక్షలు రేడియాలజీ, పతలాజి ల్యాబ్ లకు శంకుస్థాపన చేశారు మంత్రి హరీశ్ రావ్. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు రోగ నిర్దారణ కోసం ఈ ల్యాబ్ లు ఉపయోగ పడుతాయని అన్నారు. 200 పడకల ఆస్పత్రి ఆవరణలోనే మెడికల్ కాలేజీ వస్తుందని హరీశ్ రావ్ అన్నారు. వారం రోజుల్లో డయాలసిస్ సెంటర్ ,సిటి స్కాన్ మిషన్ మంజూరు చేస్తామని అన్నారు. ANM లు పని చేసే చోట 40 ఆరోగ్య కేంద్రాల నిర్మాణం కోసం రూ. 8 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు.
Phc ఉన్న చోటికి మెడికల్ కాలేజ్ స్థాయికి భూపాలపల్లి ఎదుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో ఆరోగ్య పరంగా మరింత అభివృద్ధి చేసుకుందామని భూపాల పల్లి ప్రజలకు ఆయన ఉత్సాహాన్ని నింపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అత్యధికంగా పెద్ద ఆపరేషన్ చేస్తున్నారని, ఇది మంచి పరిణామం కాదని, అనేక అనర్థాలు జరుగుతున్నాయని అన్నారు. సిజరియనల్లు అవసరం మేరకే చేయాలి తప్ప అనవసరంగా చేయవద్దని వైద్యులకు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం మంచిదని ఆశలు, ఏఎన్ఎం లు ప్రచారం చేయాలని కోరారు.
సీఎం కెసిఆర్ మీకు మరో వరం ఇచ్చారని, కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు ప్రారంభించనున్నట్లు హరీశ్ రావ్ ప్రకటించారు. 8 జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్ పంపిణీ పథకం అమలు చేయబోతున్నామని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెంచిన ఘనత సీఎం కెసిఆర్ దే అని అన్నారు. అన్ని రకాల మందులు రోగులకు అందుబాటులో ఉంచడం కెసిఆర్ లక్ష్యమని అన్నారు. రాష్ట్రం ముందు వరుసలో ఉండేందుకు కలిసికట్టుగా పని చేస్తామని అన్నారు. తెలంగాణ లో కెసిఆర్ అధ్వర్యంలో ఇంత అభివృద్ధి చేస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నడ్డాకు దమాక్ ఉందా ?
నడ్డ ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదివాడని ఎద్దేవ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఒక్క ఎకరం పారలేదు హరీశ్ రావ్ అన్నారు. గడ్కరీ కాళేశ్వరం ప్రాజెక్ట్ తో తెలంగాణ సస్యశ్యామలం అయ్యింది అంటే.. మీకే క్లారిటీ లేదు మీరు ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు కాంగ్రెస్ దే అని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవికి రేటు కట్టిన పార్టీ బీజేపీ అని ఎద్దేవ చేశారు. బీజేపీ నేతలు జూట మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయితి నీ జిల్లా చేసిన ఘనత సీఎం కెసిఆర్ దే నని అన్నారు. 75 ఎండ్ల లో మూడు మెడికల్ కాలేజీ లు ఉంటే..కెసిఆర్ పాలనలో 33 మెడికల్ కాలేజీ లు తీసుకు వచ్చారని హర్షం వ్యక్తం చేశారు హరీశ్ రావ్.
Nara Lokesh: జగన్ గారూ.. నిన్నటి సూసైడ్.. నేడు రేప్‌గా ఎలా మారింది?