Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
- హుండీలో బయటపడిన వింత కోరిక
- స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు
- దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs 20 Note Viral in Anantapur: అనంతపురం జిల్లాలోని ఓ దేవాలయంలో హుండీ లెక్కింపు సమయంలో వెలుగుచూసిన ఘటన భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా భక్తులు ఆరోగ్యం, ఉద్యోగం, విద్య, ఆర్థికాభివృద్ధి వంటి కోరికలను దేవుడికి మొక్కుకుంటారు. అయితే ఓ మహిళ మాత్రం తన అత్త వేధింపుల నుంచి విముక్తి కల్పించాలంటూ.. దేవుడికి చేసిన వినతి అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇందుకు సంబంధించిన 20 రూపాయల నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రసిద్ధ పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అధికారులు గురువారం (జూన్ 18) హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సమర్పించిన నగదు, కానుకలను పరిశీలిస్తుండగా.. ఓ రూ.20 నోటుపై రాసిన సందేశం అధికారుల దృష్టికి వచ్చింది. ఆ నోటుపై ‘స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. ఆమె త్వరగా చనిపోయేలా చూడు’ అని చేతిరాతతో రాసి ఉంది. ఇది చూసి ఆలయ సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇంగ్లీషులో రాసున్న మరో నోటు కూడా ఉంది.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ఈ వినతి సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. కుటుంబ కలహాలు, అత్తా-కోడళ్ల మధ్య విభేదాలు ఎంత తీవ్ర స్థాయికి చేరుకుంటే.. ఇలాంటి కోరికను దేవుడి ముందుంచుతారో అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు దీనిని సరదాగా తీసుకుంటుండగా.. ఇంకొందరు కుటుంబ సమస్యల తీవ్రతకు ఇది నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. దేవాలయ హుండీల్లో భక్తులు తమ కోరికలను కాగితాలపై రాసి వేయడం కొత్త విషయం కాదు. అయితే ఒకరి మరణాన్ని కోరుతూ నోటుపై నేరుగా వినతి రాయడం మాత్రం చాలా అరుదైన ఘటన అనే చెప్పాలి. ఈ వింత కోరిక ప్రస్తుతం అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!