Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
- భారత్‌కు కోచ్ కాదు.. మెంటర్ కావాలి
- టీ20 ప్రపంచకప్ విజయంలో గంభీర్‌కే మొత్తం క్రెడిట్ ఎందుకు?
- ఆశిష్ నెహ్రా తరహా కోచ్‌లపై ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sreesanth Feels Team India Don’t Need a Gautam Gambhir: టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఎస్. శ్రీశాంత్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. టీమిండియాకు కోచ్ కంటే మెంటర్ అవసరమని, ఆ పాత్రకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వంటి వ్యక్తి సరైన ఎంపిక అని అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్ 2026 విజయంలో గంభీర్‌కే మొత్తం క్రెడిట్ ఇవ్వడం కూడా సరికాదని శ్రీశాంత్ పేర్కొన్నాడు.
టెస్టుల్లో వైఫల్యాలకు గంభీర్‌నే బాధ్యుడు:
తాజాగా ఓ ఇంటర్వ్యూలో భారత జట్టు ఇటీవల టెస్ట్ క్రికెట్లో ఎదుర్కొన్న పరాజయాల గురించి మాట్లాడిన శ్రీశాంత్.. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల చేతిలో స్వదేశంలో సిరీస్‌లు కోల్పోవడం గౌతమ్ గంభీర్ కోచ్‌గా ఉన్న సమయంలోనే జరిగిందని గుర్తు చేశాడు. గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు కూడా అర్హత సాధించలేకపోయిందని పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో 0-3, ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సిరీస్ ఓటమి, ఇంగ్లాండ్‌తో డ్రా, దక్షిణాఫ్రికాతో మరో సిరీస్ పరాజయం వంటి ఫలితాలు జట్టు ప్రదర్శనపై ప్రశ్నలు లేవనెత్తాయన్నాడు.
Also Read
- ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
- Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
- ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
- India vs Pakistan: "అసలు మజా అప్పుడే".. దాయాదుల మధ్య పసిడి పోరు..
భారత్‌కు కోచ్ కాదు.. మెంటర్ కావాలి:
గంభీర్ కోచింగ్ విధానంపై తనకు అభ్యంతరాలు ఉన్నాయని శ్రీశాంత్ వెల్లడించాడు. ‘భారత జట్టుకు కోచ్ అవసరం లేదు. ఒక మంచి మెంటర్ అవసరం. ఆటగాళ్లపై అధిక ఒత్తిడి తీసుకురావడం సరైన పద్ధతి కాదు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న ఆటగాళ్లకు తమ బాధ్యతలు తెలుసు. వారికి మద్దతు ఇచ్చే వ్యక్తి కావాలి. ధోనీ సరైన వ్యక్తి. ధోనీ ఎప్పుడూ ఆటగాళ్లపై అనవసర ఒత్తిడి పెట్టేవాడు కాదు. విఫలమైన వెంటనే వారిని పక్కన పెట్టే విధానాన్ని అనుసరించలేదు. ముందుగా ఒక సోదరుడిలా ఉండాలి. గెలిస్తే నవ్వుతూ, ఓడితే కోపపడే వ్యక్తి కాకూడదు. ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసాన్ని నింపే వ్యక్తి కావాలి. ధోనీ అదే చేశాడు. అందుకే భారత జట్టుకు ధోనీ లాంటి మెంటర్ అవసరం’ అని శ్రీశాంత్ అన్నాడు.
గంభీర్‌కే మొత్తం క్రెడిట్ ఎందుకు?:
టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత గౌతమ్ గంభీర్‌కు వచ్చిన ప్రశంసలపై కూడా శ్రీశాంత్ స్పందించాడు. ప్రపంచకప్ గెలవడంలో ఆటగాళ్ల పాత్రే కీలకమని, మొత్తం క్రెడిట్ కోచ్‌కు ఇవ్వడం సరికాదని అన్నాడు. ‘భారత్ ప్రపంచకప్ గెలిచినప్పుడు అందరూ గంభీర్‌ను ప్రశంసించారు. కానీ సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్ల ప్రదర్శనలు లేకపోతే.. మైదానంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే జట్టు గెలిచేదా?. కోచ్ మైదానంలో నిర్ణయాలు తీసుకోడు కదా’ అని మాజీ పేసర్ శ్రీశాంత్ ప్రశ్నించాడు.
ఆశిష్ నెహ్రా తరహా కోచ్‌లపై ప్రశంసలు:
జట్టుతో ఎప్పుడూ మమేకమై, ఆటగాళ్లతో సన్నిహితంగా ఉండే కోచ్‌లు ఎక్కువ ప్రభావం చూపగలరని శ్రీశాంత్ అభిప్రాయపడ్డాడు. ఆశిష్ నెహ్రా తరహా కోచ్‌లు టీమిండియాకు అవసరం అని చెప్పుకొచ్చాడు. గౌతమ్ గంభీర్ కోచింగ్ శైలిపై శ్రీశాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎంఎస్ ధోనీని మెంటర్‌గా తిరిగి తీసుకురావాలన్న అతని సూచనపై అభిమానులు, మాజీ క్రికెటర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?