తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు కుమ్మక్కై బీజేపీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజల మృతికి కారకులవుతున్నారని, పోలీసులు తమ పోలీస్ యూనిఫాం వదిలేసి గులాబీ కండువా కప్పుకోవాలని బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. రామాయంపేట్ లో తల్లి కొడుకుల ఆత్మహత్య, ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త మృతిపై డీకే అరుణ స్పందిస్తూ ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేసారు. ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేస్తున్న…
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులకు కీలక సూచలను చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ఏప్రిల్ 27న హైదరాబాద్ హెచ్ఐసీసీలో నిర్వహించనున్న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన కేటీఆర్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దయచేసి కేవలం ఆహ్వానాలు ఉన్నవారు మాత్రమే రావాలి, వారికి పాస్లు అందజేస్తాం అన్నారు.. దాదాపు మూడు వేల మంది ప్రతినిధులు హాజరవుతారు.. మంత్రులు, ఎమ్యెల్యేలు, ఎంపీలు,…
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ఖమ్మం పర్యటన రద్దు చేసుకున్నారు.. షెడ్యూల్ ప్రకారం రేపు అయన ఖమ్మంలో పర్యటించాల్సి ఉండగా.. దానిని వాయిఆ వేశారు.. ఈ- కామర్స్ పైన ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీ సమావేశం పాటు, తెలంగాణ ప్రభుత్వ స్పేస్ టెక్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. కేటీఆర్ ఖమ్మం పర్యటన మళ్లీ ఎప్పుడు ఉంటుంది అనేదానిపై ఒకటి, రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. కాగా,…
శుభమా అని కెటీఆర్ వస్తానంటే…ఆయనేదో మర్యాదగా భోజన ఏర్పాట్లు చేస్తానన్నారు…కానీ, ఆ విందు ఏర్పాట్లే సమస్యగా మారతాయని ఊహించి ఉండరు..ఇంత మంది పార్టీ నేతలు కాదంటున్న వరుసలో…కెటీఆర్ మాత్రం భోజనానికి కూర్చుంటారా ఏమిటి అని ప్రశ్నిస్తున్నాయి..పార్టీ వర్గాలు.. ఇంతకీ ఖమ్మం గుమ్మంలో కెటీఆర్ అడుగుపెట్టేదెపుడో మరి..? విందుభోజనమే కెటీఆర్ టూర్ వాయిదాకు కారణమ ఖమ్మం గులాబి నేతల మధ్య విభేదాలు మరింత పెరుగుతున్నాయా? ఖమ్మం జిల్లా కేంద్రంలో అభివృద్ది కార్యక్రమాల్లో భాగంగా మంత్రి కెటిఆర్ పర్యటించాల్సి ఉంది.…
అందరికీ బీఆర్ అంబేద్కర్ 131 జయంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కేటీఆర్. బలహీనవర్గాల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందన్నారు. బలహీనవర్గాల కోసం బలంగా నిలబడే వ్యక్తి కేసీఆర్ ఒక్కరే అన్నారు. ప్రపంచంలోనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైద్రాబాద్ లో పెట్టబోతున్నామన్నారు. భారత దేశంలో ఎవరూ చేయని విధంగా దళితుల కోసం లో టీ- ప్రైడ్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిదీ. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.…
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి కేంద్ర వైఖరిని టీఆర్ఎస్ తప్పుబడుతోంది. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. మొన్న అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టిన టీఆర్ఎస్. గురువారం రాష్ట్రంలో జాతీయ రహదారులను దిగ్భందించింది. తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. వడ్ల కొనుగోలు పై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ మంత్రి హరీష్ రావు…
తెలంగాణ రైతుల పక్షాన తాము పోరాడుతున్నామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సాంప్రదాయ పంటలను వదిలేసి ఆహార భద్రత కోసం ప్రభుత్వాలు చెప్పినందుకు రైతులు వరి పంటకు అలవాటు పడ్డారు. రైతులకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పుకుంటుందని మండిపడ్డారు. కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు 100 శాతం న్యాయం చేయలేవు. పంజాబ్ లో 100 శాతం కొంటున్న కేంద్రం ఇక్కడ మాత్రం వివక్ష చూపుతుందన్నారు జగదీష్ రెడ్డి. కేంద్రం ఎటువంటి…
తెలంగాణ రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తోందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీబచేసిన ట్వీట్ పై టీఆర్ఎస్ నేతలు పోటీ పడి కామెంట్స్ చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా చేసిన సూచనలు పరిగణలోకి తీసుకుంటారని భావించాం. కేటీఆర్ ఎదురు దాడి చేస్తున్నారు. కాంగ్రెస్ గురించి, ఈ దేశం గురించి కేటీఆర్ కు అవగాహన లేదు. దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందో చెప్తున్నా, నిజమో కాదో, తండ్రి కేసీఆర్ ను అడిగి కేటీఆర్ తెలుసుకోవాలి.…