T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
- జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్
- ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం
- యువ స్పిన్నర్ ప్రేమా రావత్‌కు అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyanka Patil Ruled Out,Prema Rawat Replaces: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో వరుసగా రెండు విజయాలతో జోష్ మీదున్న భారత మహిళల జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆఫ్‌స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమైంది. నెదర్లాండ్స్‌తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా.. ఆమె కుడి కాలి మడమకు గాయమైంది. మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండదని వైద్య పరీక్షల అనంతరం నిర్ధారణ అయింది.
నెదర్లాండ్స్ మ్యాచ్‌లోనే గాయం:
బుధవారం నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఫీల్డింగ్ చేస్తుండగా శ్రేయాంక పాటిల్ గాయపడింది. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స అందించినప్పటికీ.. ఆమె ఆటను కొనసాగించలేకపోయింది. అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో టీ20 ప్రపంచకప్ 2026కి దూరం కావాల్సి వచ్చింది. భారత స్పిన్ దళంలో కీలక బౌలర్‌గా ఉన్న శ్రేయాంక.. జట్టుకు దూరమవడం పెద్ద లోటుగా మారింది. ముఖ్యంగా టోర్నీ కీలక దశకు చేరుకుంటున్న సమయంలో ఈ గాయం టీమ్ మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది.
Also Read
- Tilak Varma: "ఇది కదా తెలుగోడి పవర్".. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
- Tilak Varma: డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ గంభీర్ మాటలు గుర్తు చేసుకుని తిలక్ వర్మ భావోద్వేగం..
- Ashwin: ‘నీటిలోంచి బయటపడ్డ చేపలా లబోదిబో’.. వైభవ్ ఆటపై సీనియర్ ప్లేయర్ ఘాటు విమర్శలు..
- Naman Dhir: విధ్వంసకర ఇన్నింగ్స్‌తో.. టీం మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారిన నమన్ ధీర్.. ఎందుకంటే..
ప్రేమా రావత్‌కు అవకాశం:
శ్రేయాంక స్థానంలో యువ స్పిన్నర్ ప్రేమా రావత్‌ను భారత జట్టులోకి ఎంపిక చేశారు. ఈ మార్పుకు ఐసీసీ ఈవెంట్ టెక్నికల్ కమిటీ అధికారిక ఆమోదం తెలిపింది. ‘శ్రేయాంక పాటిల్ గాయంతో టోర్నీ నుంచి వైదొలిగింది. ఆమె స్థానంలో ప్రేమా రావత్‌ను భారత జట్టులోకి చేర్చేందుకు ఆమోదం తెలిపాం’ అని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఇండియా-ఏ జట్టుతో ఉన్న ప్రేమా.. ఇప్పుడు సీనియర్ జట్టుతో చేరి ప్రపంచకప్ మిగిలిన మ్యాచ్‌ల్లో అందుబాటులో ఉండనుంది.
అంతర్జాతీయ అరంగేట్రానికి అవకాశం:
24 ఏళ్ల ప్రేమా రావత్ ఇప్పటివరకు భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. అయితే దేశవాళీ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనలతో మంచి గుర్తింపు సంపాదించింది. మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో ఇండియా-ఏ తరఫున అద్భుతంగా బౌలింగ్ చేసిన ప్రేమా.. 8 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. కేవలం 9.62 సగటుతో వికెట్లు తీయడం ఆమె ప్రతిభకు నిదర్శనం.
డబ్ల్యూపీఎల్‌లోనూ అనుభవం:
ప్రేమా రావత్ గత రెండు సీజన్లలో ఆర్సీబీ తరఫున ఆరు మ్యాచ్‌లు ఆడింది. మూడు వికెట్లు తీసిన ఆమె.. ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో కలిసి ఆడుతూ విలువైన అనుభవాన్ని సొంతం చేసుకుంది. అంతర్జాతీయ అరంగేట్రం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రేమాకు ఇప్పుడు ప్రపంచకప్ వేదికగా పెద్ద అవకాశం లభించింది. ఇటీవలే గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చిన శ్రేయాంక పాటిల్‌కు ఇది నిరాశ కలిగించే అంశం. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి ఆకట్టుకుంది. మరోసారి గాయం వెంటాడటంతో ప్రపంచకప్ ప్రయాణం అర్థాంతరంగా ముగిసింది. జూన్ 21న ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది.
తాజావార్తలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!