Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్‌కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్‌కు కూడా!
- టీజీ20 లీగ్‌పై వివాదం
- సిరాజ్, తిలక్ వర్మకు లీగల్ నోటీసులు
- అక్రమ లీగ్‌కు ప్రచారం ఎందుకు?
- పేర్లు మారినా అనుమతులు లేవన్న టీసీఏ
- లీగల్ నోటీసులపై స్పందించని సెలబ్రిటీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tilak Varma, Mohammed Siraj Gets Legal Notices Over TG20 League: తెలంగాణ క్రికెట్ వర్గాల్లో టీజీ20 లీగ్ వివాదం సంచలనంగా మారింది. భారత క్రికెట్ నియంత్రణ (బీసీసీఐ) అనుమతి లేకుండా నిర్వహించబోతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ లీగ్‌కు మద్దతు ఇస్తున్నారనే కారణంతో టీమిండియాకు ఆడుతున్న తెలుగు ప్లేయర్స్, ప్రముఖ సినీ నటులకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) లీగల్ నోటీసులు జారీ చేసింది. భారత క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ.. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. హీరోలు విజయ్ దేవరకొండ, వెంకటేష్ దగ్గుబాటికి నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని టీసీఏ జనరల్ సెక్రటరీ గురవా రెడ్డి తెలిపారు.
అక్రమ లీగ్‌కు ప్రచారం ఎందుకు?:
టీసీఏ ప్రధాన కార్యదర్శి గురవా రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్వహించాలనుకుంటున్న టీజీ20 లీగ్‌కు బీసీసీఐ నుంచి అనుమతులు లేవని ఆరోపించారు. అలాంటి లీగ్‌ను ప్రముఖులు ప్రచారం చేయడం సరైనది కాదని పేర్కొన్నారు. ‘టీజీ20 లీగ్‌ను చట్టబద్ధమైన టోర్నీగా చూపించేందుకు సెలబ్రిటీలను ఉపయోగిస్తున్నారు. ఇది వాటాదారులను, అభిమానులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం’ అని ఆయన విమర్శించారు. టీజీ20 లీగ్ గతంలో తెలంగాణ ప్రీమియర్ లీగ్ (TPL), తర్వాత టీటీఎల్ (TTL), అనంతరం టీజీ20 ప్రీమియర్ లీగ్ పేర్లతో మార్పులు చేసుకుంటూ వచ్చిందని టీసీఏ ఆరోపించింది.
Also Read
- Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
- Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
- Asian Games Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో భారత్‌కు సావన్ బర్వాల్ రజతం
- Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
కోర్టుకు వెళ్లే అవకాశం:
రాష్ట్ర స్థాయి ఫ్రాంచైజీ లీగ్ నిర్వహించాలంటే బీసీసీఐ నిబంధనల ప్రకారం ప్రత్యేక గవర్నింగ్ కౌన్సిల్ ఉండాలని గురవా రెడ్డి అంటున్నారు. అలాగే లీగ్ ఛైర్మన్‌ను అసోసియేషన్ సాధారణ సభ ద్వారా ఎన్నుకోవాలని అన్నారు. అయితే టీజీ20 విషయంలో అలాంటి ప్రక్రియ ఏదీ పాటించలేదని ఆయన పేర్కొన్నారు. లీగల్ నోటీసులు పంపినప్పటికీ సంబంధిత సెలబ్రిటీలు టీజీ20 లీగ్‌తో తమ అనుబంధాన్ని కొనసాగిస్తే.. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని టీసీఏ హెచ్చరించింది. ‘నోటీసులు పంపాం. అయినా సెలబ్రిటీలు ఈ లీగ్‌తో కొనసాగితే కోర్టులో కేసులు కూడా వేస్తాం’ అని గురవా రెడ్డి స్పష్టం చేశారు.
హెచ్‌సీఏపై మరో ఆరోపణ:
2021లో హైదరాబాద్ నగరానికి వెలుపల క్రికెట్ అభివృద్ధి కోసం హెచ్‌సీఏ, టీసీఏ కలిసి పనిచేయాలని బీసీసీఐ సూచించిందని.. అయితే ఆ ఆదేశాలను హెచ్‌సీఏ అమలు చేయలేదని టీసీఏ ఆరోపించింది. టీసీఏ జారీ చేసిన లీగల్ నోటీసులపై ఇప్పటివరకు విజయ్ దేవరకొండ, వెంకటేష్ దగ్గుబాటి, మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, అంబటి రాయుడు స్పందించలేదు. టీజీ20 లీగ్ చుట్టూ నెలకొన్న ఈ వివాదం తెలంగాణ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బీసీసీఐ అనుమతులు, లీగ్ చట్టబద్ధత, సెలబ్రిటీల ప్రమేయం వంటి అంశాలపై రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
-
TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?