గతంలో మేము ఉచిత విద్యుత్ ఇచ్చి రూపాయి ప్రచారం చేసుకున్నాం. కానీ కేసీఆర్ ఇచ్చే విద్యుత్ కి అయ్యేంత ఖర్చు పబ్లిసిటీకి పెడుతున్నారు. లక్ష రూపాయలు మాఫీ మేము చేశాం… కేసీఆర్ చేయకపోయినా చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. చేసేది పది పైసల పని… చేసేది వంద రూపాయల ప్రచారం.
టీఆర్ఎస్ ది గ్రాఫిక్స్ పాలన అని మండిపడ్డారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. శివాజీ సినిమా..రజినీకాంత్ స్టైల్ లో ఉంది కెసిఆర్ పాలన. సభ ద్వారా రుణమాఫీ ఏమైంది అని అడుగుతారు. గిట్టు బాటు ధర ఏది అని అడుగుతారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసమే రాహుల్ వస్తున్నారు. ఉస్మానియా యూనివర్శిటీ పర్యటన పై కార్యాచరణ ఉంటుంది. వరుసగా మూడు రోజుల కార్యాచరణ ఉంటుందన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రైతులను ముంచడంలో కేసీఆర్.. మోడి అన్నదమ్ములే అన్నారు.