Dhulipalla Narendra: పేదోడ్ని కొట్టి అదానీకి పెడుతున్న జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ ప్రతి రోజూ ఉదయాన్నే సీఎం జగన్మోహన్ రెడ్డికి దండం పెడుతున్నారు. జగన్ వైఖరి వల్ల.. ఏపీలోని విద్యుత్ కోతల వల్ల ఏపీ నుంచి పరిశ్రమలు తెలంగాణకు తరలిపోతున్నాయన్నారు టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర. ఏపీలో ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోవాలని అనుకుంటున్నాయి.. ఇక కొత్త పరిశ్రమలు రావడానికే భయపడుతున్నాయి.
ఏపీలోనే సోలార్ పవర్ రూ. 2కే లభ్యమవుతోంటే.. అదానీ దగ్గర నుంచి రూ. 4కు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరమేంటి.?ఎక్కడైనా పెద్దోడ్ని కొట్టి.. పేదోడికి పెడతారు.. కానీ ఏపీలో పేదవాడిని కొట్టి అదానీకి పెడుతున్నారు. ప్రజలేమైనా ఫర్వాలేదు.. అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు మాత్రం ఆగకూడదనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు నరేంద్ర.
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు కారణంగా పేదలపై వేల కోట్ల రూపాయలు భారం వేస్తున్నారు. దేశంలో ఎక్కడా జరగని అద్భుతాలు ఏపీలోనే జరుగుతాయి.జగన్ సీఎం అయ్యాక ఏపీఈఆర్సీ రాష్ట్రంలో విద్యుత్ కోతలకు ఆదేశాలిచ్చే సంస్థగా మారింది.విద్యుత్ కోతలపై ఏపీ ఈఆర్సీ ఆదేశాలు జారీ చేయడం ఏంటి..?ప్రభుత్వ అసమర్థత.. వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు ఏపీ ఈఆర్సీ ప్రయత్నిస్తోంది.
యూనిట్ రూ 12కు మించకుండా విద్యుత్ కొనుగోలు చేయొద్దంటూ ఏపీ ఈఆర్సీ సీలింగ్ విధించడం ఆశ్చర్యంగా ఉంది. వ్యవసాయానికి తొమ్మిది గంటల నుంచి ఏడు గంటలకు తగ్గించారు.. ఇప్పుడు రోజుకు గంట విద్యుత్ సరఫరా ఉండడం కూడా గగనంగా మారింది. విద్యుత్ కోతలతో ఆక్వా రంగం అల్లాడుతోంది.పవర్ కట్లు.. పవర్ హలిడేల్లో మాత్రం జగన్ ప్రభుత్వం ప్రగతిని సాధించింది.ఒకప్పుడు వెలుగుల ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అంధకార ఆంధ్రప్రదేశ్‌గా మారింది.టీడీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా ఛార్జీ పెంచలేదు.. ఒక్క ఛాన్స్ అని వేడుకున్న జగన్.. ఇప్పుడు ఛార్జీలతో బాదేస్తున్నారన్నారు ధూళిపాళ్ళ నరేంద్ర.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!