తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మాటల యుద్ధం నడుస్తోంది. నిత్యం సోషల్ మీడియా వేదికగా ఇరుపార్టీల నేతలు విమర్శలు చేసుకుంటూనే వుంటారు. తాజాగా మంత్రి కేటీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనపై నిప్పులు చెరిగారు. బీజేపీ పాలనలో బొగ్గు కొరత కరోనా టైంలో ఆక్సిజన్ కొరత పరిశ్రమలకు కరెంట్ కొరత యువతకు ఉద్యోగాల కొరత గ్రామాల్లో ఉపాధి కొరత రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత అన్ని సమస్యలకు మూలం PM మోడీకి విజన్ కొరత అంటూ ట్వీట్ చేశారు.…
తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీపీసీసీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల్ని నిలువరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. నిన్న హైదరాబాద్ లో విద్యార్థి నాయకుల అరెస్టులకు నిరసనగా సోమవారం కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం చేయాలని టీపీసీసీ అధ్యక్షేులు రేవంత్ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించినందుకు ఎన్ఎస్…
తెలంగాణ ప్రజల కోసం నేను ప్రాణం అయినా ఇస్తానన్నారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. బంగారు తెలంగాణ అయిందా? వెండి తెలంగాణ అయినా అయిందా? అప్పుల తెలంగాణ అయింది. అప్పులు ఎందుకు అయిపోయాయి? నాకు ఎందుకు పర్మిషన్ ఇవ్వరని పాల్ ప్రశ్నించారు. 8 ఏళ్ళ వరకూ నిరుద్యోగులు గుర్తుకురాలేదా? నాకు సెక్యూరిటీ అడిగినా ఇవ్వలేదు. నేను రాకుంటే ఇంకా దోచుకుంటారా? ఇంకా తెలంగాణను అమ్మేస్తారా? మీకోసం నేను వచ్చా. ఒక్కొక్కరు వందమంది వెయ్యిమందికి చెప్పండి. అన్నివర్గాల…
తెలంగాణ మంత్రి కేటీఆర్ అభివృద్ధిపై మాట్లాడుతూ.. పక్క రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. అప్పటి నుంచి కేటీఆర్పై కౌంటర్ ఎటాక్ మొదలైంది.. ఇక, కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు నారా లోకేష్.. అయితే, కేటీఆర్ వ్యాఖ్యలకు మీడియాతో పాటు నారా లోకేష్ కూడా వక్రీకరించారని మండిపడ్డారు ఏపీ మంత్రి ఆర్కే రోజా.. ఆయన పక్క రాష్ట్రాలు అన్నారు.. గానీ, ఆంధ్రప్రదేశ్ అని అనలేదని.. ఒక వేళ ఆంధ్ర…
*ఇవాళ ఢిల్లీలో కీలక న్యాయ సదస్సు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు,ముఖ్యమంత్రులు సదస్సు. ప్రారంభించనున్న ప్రధాని మోడీ. హాజరుకానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. * ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం. 64 అంశాలతో అజెండాను రూపొందించిన అధికారులు * తిరుపతిలో మే 5న సిఎం జగన్ చేతులమీదుగా చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన. ఎస్వీ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభం *నేడు నంద్యాలలో ఇఫ్తార్ విందులో పాల్గొననున్న డిప్యూటీ…
అభివృద్ధి, కరెంట్ కోతలు, నీళ్ల సమస్య, రోడ్ల సమస్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. అయితే, కేటీఆర్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ నేతలు.. ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తుండగా.. కేటీఆర్ చెప్పింది వందకు వంద శాతం కరెక్ట్ అంటున్నారు టీడీపీ నేతలు. ఇక, కేటీఆర్ కామెంట్లపై స్పందించిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు.. తెలంగాణ ప్రజలను అధ్వాన్నంగా పరిపాలిస్తున్న ఏపీకి కాకుండా ఉత్తరప్రదేశ్…
అభివృద్ధిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఏపీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు.. దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు రాష్ట్రానికి వచ్చి అభినందిస్తున్నారు.. కానీ, కేటీఆర్ ఎవరి మహర్బానీ కోసమే ఈ వ్యాఖ్యలు చేశారని కౌంటర్ ఇచ్చారు.. కేటీఆర్ ఆ రకంగా మాట్లాడకూడదన్న ఆయన.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామన్నారు…ఇచ్చారా? నాలుగు చినుకులు పడగానే హైదరాబాద్ అంతా మునిగిపోతుంది.. డ్రగ్స్ కేసులు ఏ రకంగా హైదరాబాద్లో…
ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించకపోయినా.. అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రంలో రోడ్లు, కరెంట్ పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి.. కేటీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇక, ఇవాళ ప్రగతి భవన్కు వచ్చి సీఎం కేసీఆర్ కుటుంబాన్ని కలిసిన మంత్రి ఆర్కే రోజా.. ఆ తర్వాత కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు.. ఏపీ గురించి కేటీఆర్ మాట్లాడలేదు అనుకుంటున్నా.. పొరుగు రాష్ట్రం అన్నారు.. ఆంధ్రప్రదేశ్ కాదు అనుకుంటానన్నారు.…
కేటీఆర్ వ్యాఖ్యలపై వరుసగా స్పందిస్తున్నారు ఏపీ మంత్రలు.. ఢిల్లీలో మీడియాతో మట్లాడిన మంత్రి అమర్నాథ్.. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాష్ట్రం గురించి కాదను కుంటా అంటూనే కౌంటర్ ఇచ్చారు.. ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడితే, కేటీఆర్ తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బస్సులు పంపుతాం అంటే, పంపండి.. మేం కూడా పంపిస్తాం అన్నారు.. ఏపీకి వచ్చి గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి చూడండి, వాలంటైర్ వ్యవస్థ చూడండి, గ్రామ సచివాలయ వ్యవస్థను చూడండి, గాంధీజీ…
తెలంగాణ మంత్రి కేటీఆర్ పరోక్షంగా ఆంధ్రప్రదేశ్పై చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.. ఇక, కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఏపీలో విద్యుత్ కోతలు లేవని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలతో కొన్నిసార్లు విద్యుత్ పోవచ్చు.. కానీ, కోతలు లేవన్నారు.. బొగ్గు అధికంగా కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మరోవైపు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో రోడ్లు బాగుపడ్డాయని వెల్లడించారు.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. ఎన్నికలు సమీపిస్తున్నందునే…