తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీపీసీసీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల్ని నిలువరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. నిన్న హైదరాబాద్ లో విద్యార్థి నాయకుల అరెస్టులకు నిరసనగా సోమవారం కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం చేయాలని టీపీసీసీ అధ్యక్షేులు రేవంత్ పిలుపునిచ్చారు.
రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించినందుకు ఎన్ఎస్ యుఐ అధ్యక్షులు బల్మూరి వెంకట్ తో పాటు 18 మంది యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధించడం దుర్మార్గం అన్నారు. వెంకట్ తో పాటు విద్యార్థి నాయకుల అరెస్టులు చేసి జైల్లో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు రేవంత్.
అరెస్టులకు నిరసనగా సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎస్ యూఐ , యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువకులు కేసీఆర్ పాశవిక చర్యలను ఖండిస్తూ ఉద్యమించాలన్నారు రేవంత్ రెడ్డి. ఆదివారం NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ తో సహా 18 మంది NSUI నాయకులను 14 రోజుల రిమాండ్ పై చంచల్ గూడ జైలుకు తరలిస్తూ నాంపల్లి మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతల పట్ల కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు.
Telangana Wines : భానుడి దెబ్బకు.. 49 లక్షల బీర్లు తాగేశారు..