ఉత్కంఠరేపిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది.. గతంలో ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ఉప ఎన్నిక ఎమ్మెల్యేను చేసింది.. అయితే, నైతిక విజయం మాదే అంటున్నారు బీజేపీ నేతలు.. ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్ అని మునుగోడు ఫలితం చెబుతోంది అంటున్నారు బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి… వందల కోట్ల ఖర్చు చేసి, ఓటర్ నీ భయ పెట్టినా బీజేపీకి 86 వేల ఓట్లు వచ్చాయన్న ఆయన.. నైతికంగా కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి విజయం సాధించారన్నారు.. దీంతో, ఈ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం అవుతుందన్నారు. దక్షిణ తెలంగాణలో కూడా బీజేపీ ఉందని ఈ ఎన్నికతో నిరూపణ అయ్యిందని.. వచ్చే ఎన్నికల్లో 65 నుండి 70 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఇక, మునుగోడులో విజయం కేసీఆర్‌ది కాదు.. కమ్యూనిస్టులు, పోలీసుల వల్లే టీఆర్ఎస్ విక్టరీ సాధ్యం అయ్యిందన్నారు.. మరోవైపు, కేటీఆర్ నా మీది వ్యక్తిగత ఆరోపణలు చేశారు… అయనకు బుద్ది లేదంటూ విరుచుకుపడ్డారు.. నేను రాజ్ గోపాల్ రెడ్డి దగ్గర లీగల్‌గా భూమి కొనుగోలు చేశా.. భూమి కొనడం తప్పా? అని నిలదీశారు.. డాక్యుమెంట్ ఉన్నంక ఏ విధంగా హవాలా అవుతుంది…? అని ప్రశ్నించారు. గుజరాత్ నుండి వచ్చిన డబ్బులతో వివేక్‌కు సంబంధం ఉందని అన్నారు.. అసలు నాకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు.. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ ఫాల్త్ లీడర్ అంటూ ఫైర్ అయ్యారు. అయన మీద తండ్రికే నమ్మకం లేదు.. ఈయన సీఎం అయితే మునుగోడులో ఓడిపోయేవారు అంటూ సెటైర్లు వేశారు.. ఈయన ఇంఛార్జిగా ఉన్న గట్టుప్పలలో బీజేపీకి లీడ్ వచ్చిందన్న ఆయన.. హరీష్ రావు, కేటీఆర్‌లో ఎవరు సమర్థులో అర్థం అవుతుందన్నారు.. అధికారంలో ఉన్న పార్టీ ఉప ఎన్నికల్లో ఈజీగా గెలవాలి అలాంటిది.. మొత్తం ప్రభుత్వాన్ని అక్కడ దించారని విమర్శించారు. తండ్రి కొడుకుల అవినీతిపై ఊరుకునేది లేదు.. నా మీద ఒత్తిడి తెచ్చేందుకు నా పఠాన్‌చెరు ఫ్యాక్టరీని మూసి వేయించారు… అయినా, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు మాజీ ఎంపీ వివేక్.