Kishan Reddy: ఎమ్మెల్యేల కొనుగులో విషయం తెలంగాణ రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది. సీఎం కేసీఆర్ దీనిపై నిన్న మాట్లాడిన మీడియా సమావేశంలో బీజేపీ శ్రేణులు ఒక్కొక్కరు ఘాటుగా స్పందిస్తున్నారు. సీఎం మాటలకు కౌంటర్ ఇస్తున్నారు. ఈనేపథ్యంలో ఢిల్లీలో వున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సీబీఐ, సీఐడీ లను అడ్డుకునేందుకు పాత తేదీలతో జీవోలు ఇచ్చారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలలో ఒక్కరితో నైనా రాజీనామా చేయించారా? అంటూ ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ ప్రెస్ మీట్ లో చాలా బాధ పడుతూ మాట్లాడారు..అసలు సినిమా ముందుంది అని 15 రోజుల కింద చెప్పారు. కేసీఆర్ సినిమా చూశాక కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని ఎద్దేవ చేశారు. ఎక్కడా బీజేపీ ప్రస్తావన లేదని అన్నారు. స్వామిజీలతో ప్రభుత్వాలు కూలిపోతాయా? రోహిత్ రెడ్డితో కూలిపోతుందా? కేసీఆర్ సర్కార్ అంత బలహీనంగా ఉందా? రోహిత్ రెడ్డి అంత నీతి వంతుడా? ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎలా రత్నాలు అయ్యారు? అంటూ ప్రశ్నలు గుప్పించారు.
Read also: Kishan Reddy: మీ ఎమ్మెల్యేలను కొనే ఖర్మ మాకు లేదు
డిక్షనరీలో ఎన్ని రకాల తిట్లున్నాయో అన్నింటినీ కేసీఆర్ వాడారని ఎద్దేవ చేశారు. ఆక్రోశాన్ని, అబద్రతాభావాన్ని ప్రజల ముందు పెట్టారు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. చర్చించాల్సింది ఏమి లేదని,
బీజేపీలో చేర్చుకోవాలంటే, ఆశక్తి మాకు లేదా? బ్రోకర్లు మాకు అవసరమా? అంటూ సంచళన వ్యాఖ్యలు చేశారు. మేం బాజాప్తా, బరావర్, బరిగిసి చేర్చుకుంటామని స్పష్టం చేశారు. ఇలా చేసి చేర్చుకోవాల్సిన కర్మ మాకు లేదన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలన చేస్తున్నాడని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ రాకముందు సెక్రటేరియట్ పని ఎలా ఉండేది? అని ప్రశ్నించారు. నెలలో 15 రోజులు ఫామ్ హౌస్ లో ఉండే మీరు మాకు చెప్తారా? అన్నారు. కేసీఆర్ కంటే ముందున్న ముఖ్యమంత్రులు ఎంత మందిని కలిసే వాళ్ళో వైట్ పేపర్ రిలీస్ చెయ్యాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి.