తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. మునుగోడు ఓటర్లు టీ ఆర్ ఎస్ కు సీఎం కేసీఆర్ కు తెలంగాణ కు అండగా నిలిచారన్నారు టీఆర్ఎస్ ఎంపీలు వెంకటేష్ నేత, మాలోత్ కవిత, మన్నె శ్రీనివాసరెడ్డి. మునుగోడులో బీజేపీ ఓడిపోయినా బండి సంజయ్ చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారన్నారు. ఈ ఉప ఎన్నికలో టీ ఆర్ ఎస్ న్యాయం కోసం యుద్ధం చేసింది. మోడీ కార్పొరేట్ ఎత్తుగడలను మునుగోడు ఓటర్లు చిత్తు చేశారు. బండి సంజయ్ బుర్ర లేని అజ్ఞాని. డబ్బు పంచి టీఆర్ఎస్ ఎన్నికల్లో గెలిచిందని బండి సంజయ్ అనడం సిగ్గు చేటు. ఎన్నికల సంఘం కేంద్రం చేతిలో ఉంటుందని బండి సంజయ్‌కి తెలియదా? బీ ఆర్ ఎస్ ను అడ్డుకునేందుకు మోడీ,అమిత్ షా లు మునుగోడు ఉపఎన్నిక తెచ్చారని వెంకటేష్ నేత మండిపడ్డారు.
బీజేపీ ఓ డ్రామా కంపెనీలా మారింది. మోడీ అమిత్ షా లు రాజ్యాంగ వ్యవస్థలు దుర్వినియోగం చేసి మునుగోడు లో గెలవాలని చూశారు.. ఓటర్లు ఆ ప్రయత్నాన్ని వమ్ము చేశారు. 18 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే ఉప ఎన్నిక వచ్చింది. .రాజీనామా చేస్తేనే కాంట్రాక్టు ఇస్తామని మోడీ అమిత్ షా లు రాజగోపాల్ ను బెదిరించారు. రాజ్యాంగ బద్ధంగానే ఇతర పార్టీ ఎమ్మెల్యేలు టీ ఆర్ ఎస్ లో చేరారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యే లను తీసుకోలేదు. బీజేపీ పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను మార్చింది. ఇక్కడ ఎమ్మెల్యేలను తీసుకోవడంతో ప్రభుత్వం మారలేదు. బీజేపీ బట్టేబాజ్ పార్టీ, ప్రభుత్వాలను మార్చేందుకు బీజేపీ వేల కోట్ల రూపాయలు వెచ్చించిoదని ఆరోపించారు.
Read Also:Dead Body On Bike: దారుణం.. బైక్‌పై కుమార్తె మృతదేహంతో తల్లిదండ్రులు
అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్,మణిపూర్,గోవా ,సిక్కిం ల లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసేందుకు నీతి జాతి లేని రాజకీయాలు చేయలేదా? బండి సంజయ్ ఇప్పటికైనా జ్ఞానం పెంచుకోవాలి. బీజేపీ నేత వివేక్ అవివేకి. .సిగ్గు లేని దద్దమ్మ నేత వివేక్. కేటీఆర్ ను విమర్శించే స్థాయి వివేక్ కు లేదు. కార్పొరేట్ రాజకీయాలకు వివేక్ తెర లేపారు. వివేక్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయిన దొంగల పార్టీ బీజేపీ. దొంగల పార్టీ బీజేపీకి తెలంగాణలో స్థానం లేదన్నారు. బీ ఆర్ ఎస్ కు దేశమంతటా ఆదరణ లభిస్తోంది. మునుగోడు తీర్పు బి ఆర్ ఎస్ బలోపేతానికి బాటలు వేసిందన్నారు.
ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. మునుగోడులో తెలంగాణ ధర్మాన్ని నిలబెట్టారు. .పరీక్షా సమయంలో తెలంగాణ వైపు నిలబడ్డ మునుగోడు ఓటర్లకు పాదభివందనాలు. వేరే రాష్ట్రాల్లో బీజేపీ కూడా గెలిచింది.. అక్కడ కూడా అధికార దుర్వినియోగం చేసి గెలిచారా? రాజకీయాల్లో అట్టర్ ప్లాప్ నేత వివేక్.కేటీఆర్ కాదన్నారు. హుజురాబాద్ కు వివేక్ డబ్బులే వెళ్లాయి.. మునుగోడు కు వివేక్ డబ్బులే వెళ్లాయి. వివేక్ డబ్బు రాజకీయాలను మునుగోడు ప్రజలు తిరస్కరించారు. మునుగోడులో బీజేపీ ఆత్మహత్య చేసింది. తెలంగాణలో బీజేపీ కి ఆదరణ ఉండదని మునుగోడు ప్రజలు తేల్చారు. కేసీఆర్ కు ఏ పరీక్షా సమయంలో నైనా తెలంగాణ అండగా నిలుస్తుంది. మతోన్మాద శక్తులకు మునుగోడు గట్టి గుణపాఠం చెప్పారు. బీజేపీ నేతల తీరు మారకపోతే ప్రజలు తరిమి కొడతారన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి బీజేపీ నేతలపై విమర్శలు చేశారు. తెలంగాణ మోడల్ దేశానికి కావాలని మునుగోడు ప్రజలు బీ ఆర్ ఎస్ ను ఆశీర్వదించారన్నారు. బీజేపీ అబద్దాలను మునుగోడు ప్రజలు నమ్మలేదు. ఉపఎన్నిక తెచ్చిన బీజేపీ కి ప్రజలు బుద్ది చెప్పారన్నారు.
Read Also: YSR Statue : మంగళగిరిలో వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించిన అధికారులు