Swamy Goud: బీజేపీ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులపై అనేక విమర్శలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ నేత స్వామీ గౌడ్ మండిపడ్డారు. ఎవరు ఎవరికి అమ్ముడు పోలేదని, బండి సంజయ్ ఆ కామెంట్స్ ను విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. మేము అమ్ముడు పోయే వాళ్ళము అయితే.. లొంగిపోయే వాళ్ళము అయితే తెలంగాణ ఉద్యమంలో ఉండేవాళ్ళం కాదని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో మామీద ఆరోపణ చేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు ? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మా పై దాడులు జరిగిన రోజున బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. బీజేపీ కిషన్ రెడ్డి తెలంగాణ పోరు యాత్రలో మేము వెంట నడిచామని గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థతులు బాగా లేకపోతే జీతాలు ఆలస్యం అవుతాయని, గతంలో కూడా జరిగిందని స్వామీ గౌడ్ అన్నారు. సంఘాలకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయని తెలిపారు. గతంలో వరదలు వచ్చినప్పుడు సర్కార్ కు ఒక రోజు జీతం ఇచ్చామని గుర్తు చేశారు. బీజేపీ నేతలు మాటలతో మిమ్మల్ని నమ్ముకున్న ఉద్యోగులు కూడా దూరం అవుతారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులలో అన్ని రకాల భావజాలాలు ఉన్న వాళ్ళు ఉంటారని అన్నారు. ఉద్యోగ సంఘాలను కొనే శక్తి ఎవరికీ లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థతులను చూసి ఉద్యోగ సంఘాలు ఒక అడుగు వెనుక వేసి ఉండవచ్చు.. కానీ ఇది ముందుకు దూకడానికి అని చూడాలన్నారు. మా పై చేసే విమర్శలు… సద్విమర్శలు అయి ఉండాలని స్వామి గౌడ్ అన్నారు.
Read also: Adilabad Crime: డిసెంబర్ లో పెళ్లి అంతలోనే..
నిన్న కేసీఆర్ సభ అనంతరం బీజేపీ నేతలు కౌంటర్ ప్రెస్ మీట్లలో టీఆర్ఎస్ పై, కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మిషన్ భగీరథ నీళ్లు ఇస్తే ఈ ఆరో ప్లాంట్ ఎందుకు ఏర్పాటు చేశారు. అమ్ముడు పోయేటోడు కూడా ఆణిముత్యాలేనా? ఈ నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు దాచిపెడుతున్నావ్? విచారణకు ఎందుకు భయపడుతున్నావ్? ఇన్ని రోజులు వడ్లు నేనే కొంటున్నా అని రైతులను మోసం చేశావు. నిజానికి వడ్లు కొంటున్నది బిజెపి కేంద్ర ప్రభుత్వం. మేం రైతులు పండించిన వడ్లు కొంటే మీరు ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటున్నావు అన్నారు బండి సంజయ్. మోటార్లకు మీటర్లు ఎక్కడ పెట్టినం దుబ్బాకలో పెట్టామా? హుజురాబాద్ లో పెట్టామా.. ఎక్కడ పెట్టాం మీటర్లు.. రాష్ట్ర ప్రభుత్వం మునుగోడు ఎన్నికల తర్వాత మళ్లీ కరెంట్ చార్జీ పెంచబోతుంది. డిస్కంలో నష్టాల్లో ఉన్నాయి డిస్కంలో నష్టాలు ఉండడానికి కారణం ఎవరు? కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు మనసు వేదనతో ఉన్నారు. మీ నాయకులు మీ ఆత్మగౌరాన్ని కెసిఆర్ కాళ్ళ దగ్గర పెట్టారు మీరే ఆలోచించుకోండి. కెసిఆర్ కు కమ్యూనిస్టు పార్టీ నేతలు ఎందుకు మద్దతిస్తున్నారు?డబుల్ బెడ్ రూమ్ల ఇండ్ల హామీ నెరవేర్చారా? మీరు ఉద్యమం చేస్తున్న అంశాల్లో ఏవి సీఎం కేసీఆర్ నెరవేర్చారు? ఏమి నెరవేర్చకుండానే టీఆర్ఎస్ కి కమ్యూనిస్టు పార్టీ అగ్ర నేతలు ఎందుకు మద్దతిస్తున్నారు. ఎంతకు అమ్ముడుపోయారు కమ్యూనిస్టు నాయకులు అని బండి సంజయ్ అన్నారు. కమ్యూనిస్టు నేతలు ఆ పార్టీ కార్యకర్తలకు నష్టం చేస్తున్నారని విమర్శించారు. చివరకు ‘‘సూడు సూడు నల్లగొండ… గుండెపైన ఫ్లోరైడ్ బండ’’ నేనే రాసినని సిగ్గు లేకుండా కేసీఆర్ చెప్పుకుండు.. ఆ పాట రాసింది కోదాటి శ్రీను… అయినా సిగ్గు, శరం లేకుండా నేనే రాసినని అబద్దాలు చెప్పిండన్నారు.
Bhakthi Tv Kotideepotsavam 2022: భక్తి టీవీ కోటిదీపోత్సవం.. ఆధ్యాత్మిక సంరంభం… ఈరోజే ప్రారంభం