ఐటీ శాఖామంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. వారు అడిగే ప్రశ్నలకు రీట్విట్ చేస్తూ సమాధానం ఇస్తుంటారు. ప్రతిపక్షాల విసుర్లకు కూడా ఆయన సరైన రీతిలో సమాధానం ఇస్తూ సెటెర్లు వేస్తుంటారు.
తెలంగాణకు మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. మంత్రులు చెప్పే మాటలు అబద్ధాలంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
ఢిల్లీలో విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మొదటి నుంచి బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ కౌంటర్ రిమార్క్స్ తో దూసుకుపోతున్న కేటీఆర్ ఇటీవల ఉమ్మడి జిల్లా పర్యటనలో ప్రధానంగా బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ ప్రసంగాలు కొనసాగించారు.
అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అస్సలు మారే ఛాన్సే లేదు. ఇది మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో మనకు చెప్పేది. ఎప్పటికీ చెదరని మనిషిగా అందరిని గుండెల్లో చోటు సంపాదించుకున్న కేటీఆర్. ఇరవై సంవత్సరాల్లో తను దిగిన ఫోటో ఇప్పటి ఫోటోను జత చేస్తూ షేర్ చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్, కోస్గి ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఆస్పత్రులు అభివృద్ధి చెందలేదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు అభివృద్ధి చేస్తున్నామని, కొడంగల్, కోస్గి ఆస్పత్రుల్లో మెడికల్ సదుపాయాలు అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్.…
దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో ప్రధాని విఫలమయ్యారని టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ 2014 ఎన్నికలకు ముందు ఎంతో గంభీరంగా మీరు మాట్లాడినదంతా ఢాంభికమే అనేందుకు ఎనిమిదేళ్ల మీ పాలనే నిదర్శనంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అసమర్థ నిర్ణయాలు, అర్థిక విధానాలతో కొత్త ఉద్యోగాలు రాలేదు సరికదా.. ఉన్న ఉపాధి అవకాశాలకు గండి కొట్టారని మండిపడ్డారు. మీరు తీసుకున్న నోట్ల…
ప్రధానితో జీహెచ్‌ఎంసీ బీజేపీ కార్పొరేటర్ల భేటీ నేపథ్యంలో ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. మోదీజీ.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా..? ఎన్జీవోనా అంటూ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. కార్పొరేటర్లు కమ్యూనిటీ సేవ చేయాలన్న వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుబట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు రావాల్సిన నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారంటూ విమర్శించారు. నిధులు మాత్రం గుజరాత్‌కు, హైదరాబాద్‌కు మాటలా మోదీజీ అంటూ కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.…
బీజేపీ నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలి? అంటూ ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. క్షమాపణ చెప్పాల్సింది బీజీపీ తప్ప దేశం కాదని ఆయన స్పష్టం చేశారు. మత ప్రబోధకుడిపై బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత రాయబారులను పిలిపించి ముస్లిం దేశాలు నిరసన లేఖలు అందించడంతో ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించిన…