KTR Twitter: మోదీ జీ.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ ఎక్కడ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో ప్రధాని విఫలమయ్యారని టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ 2014 ఎన్నికలకు ముందు ఎంతో గంభీరంగా మీరు మాట్లాడినదంతా ఢాంభికమే అనేందుకు ఎనిమిదేళ్ల మీ పాలనే నిదర్శనంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ అసమర్థ నిర్ణయాలు, అర్థిక విధానాలతో కొత్త ఉద్యోగాలు రాలేదు సరికదా.. ఉన్న ఉపాధి అవకాశాలకు గండి కొట్టారని మండిపడ్డారు. మీరు తీసుకున్న నోట్ల రద్దు, కరోనా లాక్‌డౌన్ వంటి అనాలోచిత నిర్ణయాలతో దేశ ప్రజల ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది’’ అని మంత్రి కేటీఆర్.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ గురువారం ప్రధానికి ఘాటుగా లేఖ రాశారు. ఉద్యోగాలకు సంబంధించి తాను సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వమన్నారు.
Also Read
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
- Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
ఈ ప్రశ్నలకు బదులివ్వండి? మోదీజీ..
కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారు?మీరు ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాల భర్తీకి చేపట్టిన చర్యలు ఏంటి?మీరు ఇస్తామన్న యేటా రెండు కోట్ల ఉద్యోగాల్లో తెలంగాణ యువతకు దక్కే, దక్కిన ఉద్యోగాలెన్ని?ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేయడంతో జరుగుతున్న ఉద్యోగాల నష్టంపై మీసమాధానం ఏమిటి? ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తే ఆయా సంస్థల్లో రిజర్వేషన్ అమలు కాదు. ఫలితంగా కోట్లాది దళిత, గిరిజన, బీసీ వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు దక్కవు. దీనిపై ఆయావర్గాల యువతకు మీరేం సమాధానం చెబుతారు? అంటూ ప్రశ్నించారు.
ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ఇతోధికంగా చేయూతనిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇవ్వాలనుకుంటున్న ప్రాధాన్యం ఏమిటి?ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై ఇక్కడి యువత కు మీరు ఏం చెబుతారు?హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టు పునరుద్ధరణ లేదా ప్రత్యామ్నాయంగా మరో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని 8 ఏళ్లుగా తెలంగాణ యువత తరఫున మేం చేస్తున్న డిమాండ్‌పై మీ దగ్గర సమాధానం ఉందా? అంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నల వర్షం కురింపించారు.
యువత ఉద్యోగ- ఉపాధి అవకాశాల భర్తీపై ప్రధాని మోడీకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRTRS బహిరంగ లేఖ
• కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్
• ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మోదీ..తన హామీని నిలబెట్టుకోలేకపోయారు
1/n pic.twitter.com/Hx3rl7g5Lc— TRS Party (@trspartyonline) June 9, 2022
తాజావార్తలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
-
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
-
Import Duty Cuts on Edible Oils: పండుగలకు ముందే ఊరట.. వంట నూనెలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
ట్రెండింగ్
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!