A netizen questioned KTR on Twitter: ఐటీ శాఖామంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. వారు అడిగే ప్రశ్నలకు రీట్విట్ చేస్తూ సమాధానం ఇస్తుంటారు. ప్రతిపక్షాల విసుర్లకు కూడా ఆయన సరైన రీతిలో సమాధానం ఇస్తూ సెటెర్లు వేస్తుంటారు. రాజకీయంగా కూడా సోషల్ మీడియా వేదికగా మారింది. అయితే కేటీఆర్ తనకు వచ్చిన ప్రతి ట్వీట్ కు సమాధానం చెబుతూ వారికి సలహాలు, మరి కొందరికి సూచనలు కూడా ఇస్తుంటారు. సార్ మమ్మల్ని ఆదుకోండి అంటూ వచ్చిన ట్వీట్‌కు కూడా స్పందిస్తూ వెంటనే అధికారులను సైతం ఆదేశాలు జారీ చేస్తుంటారు. అయితే నిమిషాల్లో స్పందించే కేటీఆర్ కు ప్రేమ నకుల అనే వ్యక్తి చేసిన ట్వీట్ నిర్ఘాంత పోయేలా చేసింది. అలా ఎందుకు సాధ్యం కాదు సార్ అంటూ ప్రశ్నించిన తీరుపై మంత్రి స్మూత్ గా స్పందించారు. ఎందుకు కాదు సాధ్యమవుతుంది. అది ఎక్కడో తెలుసా అంటూ దాని గురించి మళ్లీ ఆ నెటిజన్ రీట్విట్ చేశారు కేటీఆర్. దీంతో నెటిజన్లు అందరూ వావ్ కేటీఆర్ సార్ ఇది నిజమేనా? అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ నెటిజన్ ఏం ప్రశ్నిస్తే కేటీఆర్ ఏం చెప్పారో తెలుసుకుందాం.
మంత్రి కేటీఆర్ గారూ మన హైదరాబాద్‌లో టన్నెల్ అక్వేరియం ఎందుకు లేదు? ఏదైనా హైడ్ అద్భుతమైన సరస్సుల క్రింద ఇది సాధ్యం కాదా? అని మంత్రిని ప్రశ్నించాడు. దయచేసి తెలంగాణకు అద్భుతమైన టన్నెల్ అక్వేరియం బహుమతిగా ఇవ్వండి సార్. దయచేసి ఒక్కసారి ఆలోచించండి అంటూ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశాడు నెటిజన్. అతను చేసిన కొన్ని నిమిషాల్లో మంత్రి స్పందించారు. ఎందుకు సాధ్యం కాదు. చేయొచ్చు మన తెలంగాణలో ఇలాంటి ఇప్పుడు మనం కూడా పెడుతున్నాము ఎక్కడో కాదు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడ లో భారతదేశంలోనే అతిపెద్ద అక్వేరియం మరియు ఏవియరీని నిర్మిస్తున్నామంటూ కేటీఆర్ బదులు ఇచ్చారు. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి మన మందరం కూడా ఆహ్లాదకరమైన అద్భుతమైన టన్నెల్ అక్వేరియంను అతి త్వరాలో చూడబోతున్నాము. వెయిట్ అండ్ సీ అంటూ నెటిజన్ కు రీట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో అద్భుతమైన టన్నెల్ అక్వేరియంను చూడబోతున్నామన్నమాట అంటూ నెటిజన్లు థ్యాంక్యూ కేటీఆర్ సార్. తెలంగాన ప్రజలు అనుకోవడమే ఆలస్యం అంతకుముందే రాష్ట్ర ప్రజలకు గురించి ఆలోచించి ప్రతీదీ ముందే చేసి మా ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
We are building India’s largest Aquarium and Aviary at Kothwalguda. Work is in progress
Will have @arvindkumar_ias and @HMDA_Gov share pictures and details https://t.co/Jm1vs5EM2p
— KTR (@KTRBRS) April 17, 2023