మహబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్, కోస్గి ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఆస్పత్రులు అభివృద్ధి చెందలేదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు అభివృద్ధి చేస్తున్నామని, కొడంగల్, కోస్గి ఆస్పత్రుల్లో మెడికల్ సదుపాయాలు అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్. ఈ సందర్భంగా హరీశ్‌రావు చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.
Glad Kodangal and Kosgi both now have improved medical care facilities that have been neglected in 6 decades of Congress rule 👍
Thanks to CM KCR Garu & Health Minister @trsharish Garu https://t.co/HZDqA1Wjfc
— KTR (@KTRTRS) June 16, 2022
కొడంగల్ సివిల్ హాస్పిటల్ 50 బెడ్లకు అప్‌గ్రేడ్ చేశామని హరీశ్‌రావు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, ఎక్స్ రే, అల్ట్రా సౌండ్‌తో పాటు ఇతర సదుపాయాలు కల్పించామన్నారు. రూ. 5 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన సీహెచ్‌సీని రేపు ప్రారంభించబోతున్నట్లు హరీశ్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే.
Presidential Elections: రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ వైఖరేంటి..?