KTR Twitter: తెలంగాణకు మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. మంత్రులు చెప్పే మాటలు అబద్ధాలంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మోదీజీ.. కనీసం మీ మంత్రులందరికి ఒక అబద్ధాన్ని ఒకేలా చెప్పేలా ట్రెయినింగ్ ఇవ్వండి’ అంటూ వ్యంగ్యంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా.. తెలంగాణకు మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో కేంద్ర మంత్రులు ఒకరికి మించి ఒకరు అబద్దాలు మాట్లాడారని.. పైగా ఒకే అబద్ధాన్ని ముగ్గురూ ఒక్కోలా చెప్పారని మండిపడ్డారు. అయితే.. ‘మోదీజీ.. కనీసం మీ మంత్రులందరికి ఒక అబద్ధాన్ని ఒకేలా చెప్పేలా ట్రెయినింగ్ ఇవ్వండి’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అంతేకాకుండా కేంద్ర మంత్రులు పచ్చి అబద్ధాలు మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. ముగ్గురు కేంద్రమంత్రులు పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.
Read also: Nude Video Call: అబ్బాయిలు అలర్ట్.. న్యూడ్ కాల్ చేసి లక్షలు కాజేస్తున్న కిర్రాక్ లేడీలు
ఇక.. తెలంగాణకు 9 మెడికల్ కాలేజీలు మంజూరైనట్టు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెబుతున్నారని.. మరో మంత్రి మన్సుక్ మాండవీయ మెడికల్ కాలేజీల కోసం తెలంగాణ నుంచి ఒక్క ప్రతిపాదన కూడా రాలేదంటున్నారని.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం కేవలం రెండు ప్రతిపాదనలే వచ్చాయని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఇలా ఒకరికొకరు పొంతన లేకుండా అబద్ధపు వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక అందుకే .. కేంద్ర మంత్రులు అందరూ ఒక అబద్ధాన్ని ఒకేలా చెప్పేందుకు ట్రెయినింగ్ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ సూచించారు. అంతేకాకుండా.. అదేవిధంగా తెలంగాణలో ఉనికిలో లేని 9 మెడికల్ కాలేజీలు ఉన్నట్టుగా క్రియేట్ చేసిన కిషన్‌రెడ్డిపై కేటీఆర్ మరిన్ని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. దీంతో.. అబద్ధాలు చెప్పిన ముగ్గురు కేంద్రమంత్రుల్లో కిషన్‌రెడ్డి ఆపర మేథావి అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. హైదారాబాద్‌లో గ్లోబల్ మెడికల్ సెంటర్ ఏర్పాటు గురించి కిషన్‌రెడ్డి చేసిన ప్రకటన ఒట్టి బూటకమని విమర్శించారు.
3 Union Cabinet Ministers on Medical colleges in #Telangana state👇@kishanreddybjp – 9 sanctioned @mansukhmandviya – 0 proposals received@nsitharaman – 2 proposals received
Modi Ji, train your ministers well at least to consistently peddle the same Lies & Fakery pic.twitter.com/3F51MuO3JR
— KTR (@KTRBRS) February 17, 2023
Supreme Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ఆరోజుకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు