ప్రధానితో జీహెచ్‌ఎంసీ బీజేపీ కార్పొరేటర్ల భేటీ నేపథ్యంలో ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. మోదీజీ.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా..? ఎన్జీవోనా అంటూ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. కార్పొరేటర్లు కమ్యూనిటీ సేవ చేయాలన్న వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుబట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు రావాల్సిన నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారంటూ విమర్శించారు. నిధులు మాత్రం గుజరాత్‌కు, హైదరాబాద్‌కు మాటలా మోదీజీ అంటూ కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
Modi Ji, Community service endeavours?! Are you running a Govt or an NGO?
Any update on Flood relief funds for Hyderabad? Any monetary support for Musi rejuvenation or Hyd Metro extension? Any update on ITIR?
Mere lip service for Hyderabad/Telangana & funds only for Gujarat 👏 https://t.co/cntjvBGpx9
— KTR (@KTRTRS) June 7, 2022
హైదరాబాద్‌కు వరద సాయం, మెట్రో విస్తరణ, మూసీ పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందించేందుకు ఆలోచన చేస్తున్నారా? లేదా అంటూ ప్రశ్నించారు. ఐటీఐఆర్ పై ఏమైనా పురోగతి ఉందా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ గతంలో ఎన్నడూలేని రీతిలో భారీ వరదలను ఎదుర్కొందని, కానీ ప్రధాని మోదీ ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదని మంత్రి ప్రశ్నించారు. 2018 నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ఎఫ్ నిధులు తెలంగాణకు ఇవ్వలేదని, దానికి సంబంధించిన వివరాలను మంత్రి ట్వీట్ చేశారు.
కాగా.. బీజేపీ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు ప్రధాని మోదీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా గంటన్నర పాటు సమావేశమై పలు విషయాలపై కార్పొరేటర్లతో మోదీ చర్చించారు. కార్పొరేటర్లు ప్రజల పక్షాన పోరాడాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో సుపరిపాలన రావడానికి, కుటుంబ దుష్పరిపాలనకు చరమగీతం పాడేందుకు బీజేపీ పోరాటం చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, పలువురు బీజేపీ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానితో కార్పొరేటర్లు గ్రూప్ ఫొటో దిగారు. అయితే మే 26న హైదరాబాద్ పర్యటనకు ప్రధాని మోదీ వచ్చిన సందర్భంగా జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ల నుంచి ఐఎస్‌బీ వద్ద స్వాగతం అందుకోవాలని నిర్ణయించారు. అయితే వర్షం కారణంగా అది సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే కార్పొరేటర్లను ఢిల్లీలో కలిసేందుకు ప్రధాని అపాయింట్‌మెంట్ ఇచ్చారు.
VishnuVardhan Reddy: మీది అవినీతి ఎజెండా.. మాది అభివృద్ధి ఎజెండా