కృష్ణాజలాల గురించి చాలా కాలంగా సమస్యలు ఉన్నాయి. నీటి వినియోగానికి సంబంధించి వాస్తవంగా దక్కాల్సిన వాటా తమకు దక్కడం లేదని తెలంగాణ రాష్ట్రం వెల్లడించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాదికి సంబంధించి కృష్నా జలాల వాడకం పై కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ముందు పలు డిమాండ్‌లను ఉంచింది.
ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. శుక్రవారం మధ్యాహ్నం కృష్ణా డెల్టాకు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు సాగునీరు విడుదల చేశారు. కృష్ణా తూర్పు డెల్టాకు 1500 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు. కృష్ణా డెల్టా చరిత్రలో ముందుగానే సాగునీటిని…
బండి సంజయ్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో అధికార టీఆర్ఎస్ ఓర్వలేక పోతుందన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె. లక్ష్మణ్. ప్రజా సంగ్రామ యాత్ర ప్రగతిభవన్ లో ప్రకంపనలు సృష్టిస్తుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు మోకాళ్ళ యాత్ర చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేరన్నారు లక్ష్మణ్. వెనుకబడిన పాలమూరు ప్రజలను టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం దగా చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 24గంటల ఉచిత విద్యుత్ తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నామని తెరాస నేతలు పదే పదే…
దేశంలోని నదుల అనుసంధానంపై కసరత్తును కేంద్రం వేగవంతం చేసింది. గోదావరి-కావేరి నదులను లింక్ చేసేందుకు…ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే…ఐదు రాష్ట్రాల అధికారుల అభిప్రాయాలు తీసుకునేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. నదుల అనుసంధానం ద్వారా నదీజలాలను సద్వినియోగం చేసుకునే అవకాశం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఉన్న నదుల అనుసంధానంపై కేంద్రం దృష్టి పెంచింది. దీనిపై ఈ నెల 18న ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఏపీ,…
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపును కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఖరారు చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద ఈనెల 15 వరకు 112.5 టీఎంసీల నీటి వినియోగానికి బోర్డు ఆమోదం తెలిపింది. జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు రెండు ప్రాజెక్టుల కింద ఏపీ, తెలంగాణ కలిపి 294.33 టీఎంసీల నీటిని వాడుకున్నాయి. బోర్డు తాజా నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా మరో 407 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం దక్కించుకున్నాయి. Read…
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) బృందం సోమ, మంగళవారాల్లో కర్నూలు జిల్లాలో పర్యటించనుంది. కృష్ణా నది ప్రాజెక్టుల స్వాధీనానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్పై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో కేఆర్ఎంబీ బృందం సభ్యులు రెండు రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మొత్తం కేఆర్ఎంబీ టీమ్లో 10 మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన జెన్ కో అధికారులు ఉన్నారు. Read Also: వైరల్ పిక్: చీర కట్టులో…