Andhra Pradesh: రైతులకు శుభవార్త.. కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. శుక్రవారం మధ్యాహ్నం కృష్ణా డెల్టాకు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు సాగునీరు విడుదల చేశారు. కృష్ణా తూర్పు డెల్టాకు 1500 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు.
కృష్ణా డెల్టా చరిత్రలో ముందుగానే సాగునీటిని విడుదల చేయడం రికార్డు. ప్రతి ఏడాది కృష్ణా ఆయకట్టుకు జూలై నెలలో మాత్రమే సాగునీటిని విడుదల చేస్తుంటారు. అయితే ఈ ఏడాది నెలరోజుల ముందే సాగునీటిని ప్రభుత్వం విడుదల చేసింది. కృష్ణా డెల్టా పరిధిలో 13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా డెల్టా పరిధిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలు ఉన్నాయి. పులిచింతలలో పుష్కలంగా నీరు ఉండటంతో 35 టీఎంసీల సాగునీరు అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ఏపీలో మరో రెండు రోజులలో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో తమకు ఈ ఏడాది సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని రైతులు భావిస్తున్నారు. ఇప్పటికే జూన్ ఒకటి నుంచి గోదావరి డెల్టా పరిధిలోనూ సాగునీటిని ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పుడు కృష్ణా డెల్టాలోనూ సాగునీటిని విడుదల చేయడంతో ఖరీఫ్‌లో రెండో పంటను కూడా డిసెంబర్‌లోనే వేసుకునేలా రైతులు సన్నాహాలు చేసుకుంటున్నారు.
Also Read
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!