బెజవాడ నగరాన్ని కాలుష్యం కమ్మేస్తుందా? మారుతున్న కృష్ణా జలాల రంగు వెనుక కారణం అదేనా? అంటే అవునంటున్నారు బెజవాడ వాసులు. ప్రమాదకర రసాయనాలతో కృష్ణ జలాలు కలుషితం అవుతున్నాయి…ప్రకాశం బ్యారేజ్ వద్ద పచ్చటి రంగులో రసాయనాలతో కూడిన ఒక పోర నీటిపై ఏర్పడింది..అదే నీరు ఏలూరు కాలువలో కూడా కలుస్తుంది….ఇక ఇప్పటికే కలుషితం అవుతున్న నీటితో నానా అవస్థలు పడుతున్నారు రూరర్ ఏరియా ప్రజలు.. కలుషితం అవుతున్న కృష్ణ జలాలను వాడుతున్న బెజవాడ వాసుల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. బ్యారేజ్ వద్ద పచ్చటి రంగులో నీటిపై ఏర్పడిన పొర పరిస్థితిని ప్రమాదకరంగా మార్చేస్తోంది.
Read Also:Naveen Reddy Exclusive Video: నేను ప్రేమించా.. బయటపడ్డ నవీన్ రెడ్డి వీడియో
ప్రమాదకర రసాయనాలు లేదా భారీగా పెయింట్ వెయ్యటంతో ఇలాంటి పొర ఏర్పడుతోందంటున్నారు. ఏలూరు కాలువలో కలుస్తున్న పచ్చటి పొరతో వున్న నీటిని చూసి ఏం జరుగుతుందో అర్థంకావడం లేదంటున్నారు. ఒక వైపు భవానీల స్నానాలు మరో పక్క పంటల సాగుకు వాడుతున్న కలుషిత నీరు కృష్ణా జలాల రంగుని మార్చేస్తున్నాయి. గత కొంత కాలంగా కృష్ణ నదిలో కలుస్తున్న కలుషిత రసాయనాలు,వ్యర్థ పదార్దాలు పరిస్థితిని ప్రమాదకరంగా మార్చేశాయి. ఇప్పటికే నీటి కలుషితంతో అనారోగ్యాల బారిన పడుతున్నారు రూరల్ ఏరియా ప్రజలు. కృష్ణ నదిలో కలుస్తున్న రసాయనాలతో కలుషితం అవుతున్న కృష్ణ నీటిని ఎలా వాడాలని బెజవాడ వాసులు ప్రశ్నిస్తున్నారు.
Read Also: Border Dispute: మహారాష్ట్రలో హాలు.. తెలంగాణలో వంటిల్లు.. 14 గ్రామాల విచిత్ర పరిస్థితి