Ambati Rambabu : కృష్ణా జలాలపై కేంద్రం నిర్ణయాన్ని ఖండిస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా నది పంపకాలకు సంబంధించి దశాబ్దాలుగా రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ వేసిందని, 2010లో తుది నివేదిక ఇచ్చిందన్నారు. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ కు నష్టం వాటిల్లుతుందని రాష్ట్రం సుప్రీంకోర్టు లో ఎస్ఎల్‌పీ వేసిందన్నారు మంత్రి అంబటి. అప్పుడు సుప్రీంకోర్టు స్టే విధించిందని, ఆ తర్వాత కేంద్రం మరో ట్రిబ్యునల్ వేసిందన్నారు. బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కు కొనసాగింపు ఇచ్చారని, కేంద్ర ప్రభుత్వం బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కు టీఓఆర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఇలా చేయడం చట్ట విరుద్ధమని, బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కు ఇప్పటికే విధివిధానాలు ఉన్నాయని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
కొత్త విధివిధానాలు అప్పగించటం చట్ట విరుద్ధమని, ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ ముఖ్యమంత్రి ప్రధానికి లేఖ రాశారన్నారు. న్యాయ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అంబటి తెలిపారు. త్వరలోనే సుప్రీంకోర్టు ను ఆశ్రయిస్తామని, రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరిగితే సహించమని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావలసిన ఒక్క నీటి బొట్టును వదులుకోమన్నారు. అంతేకాకుండా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి ఆరోపణలు చేశారు. టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రతి అవినీతి లో పవన్ కల్యాణ్‌కు కూడా వాటా ఉందని, అవినీతి ప్రభుత్వానికి మొదట మద్దతు ఇచ్చింది పవన్ కల్యాణ్ అని ఆయన అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చటం కాదు అసలు ఆ రెండు పార్టీల ఓట్లు కలుస్తాయని, పవన్ కళ్యాణ్ కు ఉన్నదంతా చిత్తశుద్ధి కాదు చెత్తశుద్ధి అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
అక్రమంగా అరెస్టు చేశారు అంటున్న వారికి న్యాయ వ్యవస్థ పై నమ్మకం లేదా?? అని ఆయన ప్రశ్నించారు. రోజుకు కోటి రూపాయలు తీసుకునే పెద్ద పెద్ద లాయర్లు చంద్రబాబు తరపున వాదించారని, అంత మేధావులు, సీనియర్ లాయర్లు వచ్చి వాదించినా చంద్రబాబుకు ఊరట లభించ లేదన్నారు. ప్రాధమిక ఆధారాలు ఉన్నాయి కనుకే కోర్టులు ఊరట ఇవ్వటం లేదని, టీడీపీ లైట్లు ఎప్పుడో ఆర్పాయని, చంద్రబాబు ఎంతో మంది లైట్లు ఆర్పాడన్నారు
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!