Uttam Kumar Reddy : తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. సోమవారం జరిగిన మీడియా చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం నుండి కృష్ణా జలాల పంపకాల వరకు బీఆర్ఎస్ నేతలు అనుసరించిన విధానాలు తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారాయని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయాంలోనే కూలిపోయిందని,…
CM Revanth Reddy : దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కలుగులో నుంచి బయటకు వచ్చిన కేసీఆర్, తన పాత పద్ధతిని మార్చుకోకుండా మళ్ళీ అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. శనివారం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఘాటుగా స్పందించారు. ఓటమితోనైనా కేసీఆర్ మారుతారని ఆశించానని, కానీ ఆయన తీరు మారలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారని…
ఓట్లు అన్నీ నీకు వేస్తే.. నీళ్ళు రాయలసీమకు ఇచ్చారు కేసీఆర్ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ జాతిపిత అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా.. తెలంగాణలో ఆయనకట్టు ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. నల్గొండకు కోతలు... రంగారెడ్డి కి నీళ్ళు ఇవ్వలేదన్నారు.. గోదావరి నీళ్లు రాయలసీమ తీసుకుపోతే తప్పులేదు అన్నారని చెప్పారు. పొద్దున్న క్లబ్.. రాత్రి ఐతే పబ్బుల్లో చర్చ చేయాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు..
Kasam Venkateswarlu: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కలిసి బీజేపీపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని, బనకచర్ల ప్రాజెక్ట్ అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు విఫలం అయ్యాయని అయ్యన అన్నారు. బనకచర్లపై సరైన సమయంలో కావాల్సిన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. బనకచర్లపై CWC అనుమతి తప్పనిసరి ఉంటుంది. అలాగే బనకచర్ల అంశంలో…
Jagadish Reddy : తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గోదావరి – కృష్ణ జలాల వినియోగానికి సంబంధించిన అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. నీటి వాటా విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు నష్టం చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కీలక అంశంపై…
తెలంగాణలో యాసంగి పంట సేకరణకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ దేశంలో అత్యధిక వరి సాగు జరిగే రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు.
Uttam Kumar Reddy : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో ఒక్క అవకాశాన్ని కూడా కోల్పోకుండా కట్టుబడి పని చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం రోజున రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, కృష్ణా జలాల వివాదాల నేపథ్యంలో న్యాయవాదులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరగనున్న కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్…
Kaleswaram Commission: నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ తిరిగి ప్రారంభం కానుంది. గతంలో కమిషన్ ఎదుట హాజరైన వ్యక్తుల్లో కొందరిని మళ్లీ విచారణ చేయాలని నిర్ణయించింది. ఈ విచారణలో ముఖ్యంగా అనుమతులు, నిర్మాణ పనుల్లో కీలకంగా వ్యవహరించిన ఇంజినీర్లను ప్రశ్నించనుంది. కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లు, విచారణలో చెప్పిన అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు కమిషన్ భావిస్తోంది. అందువల్ల, నిజమైన అంశాలను వెలికితీయడానికి ఈ దర్యాప్తును మరింతగా క్షుణ్ణంగా నిర్వహించనున్నట్లు సమాచారం. Read Also: Telugu Language:…
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అలవాటైన పైశాచిక భాషలో పాలమూరు ప్రగతిపై పచ్చి అబద్ధాలు ఆడిండు.. పిచ్చి ప్రేలాపనలు పేలిండు అని హరీష్ రావు అన్నారు. కృష్ణా జలాలను ఏపీ యదేచ్చగా తరలించుకపోతుంటె ఆపడం చేతగాక, నీ చేతగాని తనని గుర్తు చేసిన మా మీద రంకెలేస్తున్నావు.. పాలమూరును ఎడారిగా మార్చిన పాపిష్టి పార్టీలు తెలుగుదేశం, కాంగ్రెస్ లతో…
Uttam Kumar Reddy : గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన బిఆర్ఎస్ నాయకులకు కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన ప్రాజెక్టులను గత పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మాట…